fbpx
NEWS

పదవతరగతి అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. రూ.60వేల జీతం.

ఇండియన్ నేవీలో సెయిలర్ (మ్యుజీషియన్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పెళ్లి కాని పురుష అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు అప్లే చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: మే6,2019 దరఖాస్తుకు చివరి తేదీ: మే 19, 2019 అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత ఇతర అర్హతలు: నిర్దేశించిన సంగీత సామర్థ్యాలు, మ్యూజికల్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి శారీరక ప్రమాణాలు: 157 సెంటీమీటర్ల ఎత్తు, 5 సెం.మీ ఛాతి కలిగి ఉండాలి. ఫిజికల్ టెస్ట్: 1.6 కిలోమీటరల్ దూరాన్ని 7 నిమిషాల్లో పూర్తి చేయాలి. 10 పుషప్‌లు, 20 గుంజీలు తీయగలగాలి. వయసు: 17 నుంచి 21 సంవత్సరాల మధ్య ఉండాలి. 1994 అక్టోబర్ 1 నుంచి 2002 సెప్టెంబర్ 30 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక: సంగీత సామర్థ్యం, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ ఆధారంగా పే అండ్ అలవెన్స్: ట్రైనింగ్‌లో రూ.14,600 (స్టైఫండ్).. తరువాత రూ.21,700 నుంచి 69,100 + రూ.5,200 MSP+DA ప్రిలిమినరీ స్క్రీనింగ్ టెస్ట్: జులై 6 వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఫైనల్ స్క్రీనింగ్: సెప్టెంబర్ 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు వెబ్‌సైట్: www.joinindian navy.gov.in