fbpx
Food & Drinks NEWS VIDEOS

రైతు 3 ఎకరాల్లో 62 రకాల వరి పంటలు

శ్రీ వరి అంటేవరిసాగు-సిస్టమ్‌ ఆఫ్‌ రైస్‌ ఇంటెన్సిఫికేషన్‌(శ్రీ) వరిసాగులో కొన్ని అపోహలు: వరి జల సంబంధమైన మొక్క అని అందరికీ తెలుసు. నీటిలో పాతుకు పోతున్నప్పుడు బాగా పెరుగుతుంది. అలాగని వరి నీటి మొక్క కాదు. వేళ్ళల్లో గాలి బుడగ ఏర్పాటవడానికి వరి మొక్క ఎంతో శక్తిని వినియోగించుకోవలసి వస్తుంది. వరిలో పూత సమయంలో సుమారు 70% వేరు చివర్లు నాశనమైపోతాయు. శ్రీ వరిసాగులో నిజంకాని అపోహలు: శ్రీ వరిసాగు పొలంలో నీరు లోతుగా ఉండనవసరం లేదు.

 

చేను పేరిగేటప్పుడు తడిగా ఉంటే చాలు. ఆ తరువాత 2.5 సెం.మీ వరకు నీరు ఉండాలి.శ్రీ వరిసాగుకు సాంప్రదాయ పద్ధతిలో వరి చేనుకు కావలసినంత నీటి లోతులో సగమయితే చాలు. ప్రపంచ వ్యాప్తంగా ఒక లక్ష మందికి పైగా ఈ శ్రీ వరిసాగు పద్ధతిని అనుసరించి లబ్దిపొందుచున్నారు. శ్రీ వరిసాగుకు కావలసిన నీరు తక్కువగా ఉండును. పైగా ఖర్చుకూడా తక్కువే. దిగుబడి మాత్రం ఎక్కువ. చిన్న రైతులకు శ్రీ వరిసాగు ఎంతో లాభదాయకం.

 

తూర్పు ఆఫ్రికా సమీపంలో ఉన్న మలగాసీ దీవి(మడగాస్కర్‌) లో శ్రీ వరిసాగు పద్ధతిని మొట్టమొదట అభివృద్ధి చేశారు. చైనా, ఇండోనేషియా, కంబోడియా, థాయిలాండ్‌, బంగ్లాదేశ్, శ్రీలంక, భారతదేశం వంటి అనేక ప్రపంచ దేశాల్లో ఈ శ్రీ వరి సత్తాను పరీక్షిస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్‌ లో 22 జిల్లాల్లో 2003 ఖరీఫ్‌ సమయంలో ప్రవేశ పెట్టగా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించారు. శ్రీ వరిసాగు లో ప్రత్యేకంగా ఏవీ వాడనవసరం లేదు. శ్రీ వరిసాగు లో విత్తనాలను 25 సెం.మీ. విస్తిర్ణంలో తక్కువగా వరి మొక్కలు నాటిస్తే చాలు. సాంప్రదాయ పద్ధతిలో వరిసాగులో ఎకరానికి 20 కి.గా. విత్తనాలు వాడవలసి ఉంటుంది.

WATCH VIDEO: