fbpx
NEWS

లిఫ్ట్ లో రొమాన్స్.. అడ్డంగా దొరికిపోయిన హీరో , హీరోయిన్

తెలుగులో ఈ మధ్య బోల్డ్ కంటెంట్ సినిమాలకు కొదువే లేకుండా పోతుంది. కాసుల వర్షం కురిపిస్తుండటంతో నిర్మాతలు ఎక్కడ తగ్గడం లేదు. వెబ్ సిరీస్‌లలో సంచలనం సృష్టించింది గంధీ బాత్. 2018లో వచ్చిన ఈ వెబ్ సిరీస్‌ను సచిన్ మోహిత్ తెరకెక్కించాడు. ఏఎల్టీ బాలాజీ దీన్ని నిర్మించింది. ఒక్కో ఎపిసోడ్‌ను ఒక్కో రకంగా తెరకెక్కించారు. ఇందులో అడల్ట్ కంటెంట్ చూపించడంతో ఈ సిరీస్ విజయం సాధించింది.

తెలుగులో పలు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది లక్స్ పాప ఆశా షైనీ అలియాస్ ఫ్లోరా షైనీ. ఈమెను ప్రధాన పాత్రగా తీసుకుని గంధీ బాత్ సీజన్ -2 తెరకెక్కించారు. ఇందులో పనిమనిషిగా నటిస్తున్న ఆమె ఇద్దరి బ్రదర్స్‌తో పాటుగా లెస్బియన్ రొమాన్స్ కూడా చేసింది. ఈ సీజన్‌లో ఫ్లోరా షైనీతో పాటుగా మరో ముద్దుగుమ్మను బాగా వాడుకున్నారు. దీంతో గంధీ బాత్ – 2కు భారీ రెస్పాన్స్ వచ్చింది.మొదటి రెండు సీజన్లు భారీ విజయాలను సొంతం చేసుకోవడంతో గంధీ బాత్ – 3ని తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో లీకై బయటకు వచ్చింది. ఇందులో శీవా రానా, లలిత్ లిఫ్ట్‌లో సెక్స్ చేస్తున్నట్లు చూపించారు.

గతంలో సీజన్ – 2 చేస్తున్న సమయంలో లెస్బియన్ సెక్స్ సీన్ లీకైంది. ఇప్పుడు కూడా సీజన్ ప్రారంభం కాకముందే మరో వీడియో బయటకు వచ్చింది. దీంతో యూనిట్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసం కావాలనే ఇలా లీక్ చేస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఈ వీడియో హాట్ టాపిక్ అవుతోంది.