fbpx
Celebrities Entertainment Fashion NEWS

ఇలియానా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌ అయింది

అందాలు ఆరబోయడంలో ఏ మాత్రం వెనుకాడని గోవా బ్యూటీ మరోసారి హాట్ కిక్కిచ్చింది. సెగలు రేపే బికినీ లుక్ పోస్ట్ చేసి కుర్రకారును యమ అట్రాక్ట్ చేసింది. లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ఈ గోవా బ్యూటీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌ అయింది. నిత్యం అభిమానులతో టచ్‌లోకి రావడంతోపాటు తన హాట్ ఫొటోలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా పోస్ట్ చేసిన బికినీ పోజ్ తెగ వైరల్ అయింది.

 

నిత్యం బీచ్‌‌ల వెంటే తిరిగే అందాల ఆరబోతలో స్పెషలిస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో చాలా రోజుల పాటు ఇంటికే పరిమితమైన ఈ గోవా బ్యూటీ.. మళ్లీ బీచ్‌ ఒడ్డున చేరింది. హాట్ హాట్‌ లో- దుస్తుల్లో బీచ్‌లో సేద తీరుతూ కనిపించింది ఇల్లీ బేబీ. ‘ఇన్నాళ్ల ఎదురుచూపులు ఇప్పుడు ఫలించాయి. మంచి రోజులు వచ్చాయ్.. సాధారణ స్థితికి వచ్చాను’ అంటూ ఈ సందర్భంగా ఇలియానా తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఇలియానా పోస్ట్ చేసిన ఈ బికినీ పిక్ చూసి.. ”హాట్ బ్యూటీ, సో.. సెక్సీ, బ్యూటిఫుల్” అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు నెటిజన్లు.

 

‘దేవదాస్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఇలియానా.. ఆ తర్వాత ”పోకిరి, జల్సా, రాఖీ” లాంటి పలు సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించి బాలీవుడ్ బాట పట్టింది. తిరిగి చాలాకాలం తర్వాత తిరిగి ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమాతో టాలీవుడ్ వంక చూసినా పెద్దగా కలసి రాలేదు. దీంతో మళ్లీ బాలీవుడ్ వైపుగా అడుగులేస్తోంది. ఈ క్రమంలోనే త్వరలో అభిషేక్‌తో కలిసి మరో బాలీవుడ్ సినిమాలో నటించబోతోంది. మరోవైపు వెబ్ సిరీస్‌లు కూడా చేయడానికి సిద్ధమవుతోంది.