టాలివుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు..అమ్మగా,వదినగా ఎన్నో పాత్రల్లో ఒదిగిపోయిన ఆమె ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్ముదులుపుతుంది..లాక్ డౌన్ కాలంలో లుంగి డ్యాన్స్, జిమ్ వీడియోలతో సినిమాల్లో చూసిన ప్రగతేనా ఈమె అని ఆశ్చర్యపోయేలా చేసింది..మరోసారి బంటీ ఔర్ బబ్లీ సినిమాలోని పాటకు ప్రగతి డాన్స్ చేసి వీడియోను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
“Do something that makes you feel good everyday” అని క్యాప్షన్ పెట్టి కజరారే కజరారే పాటకు డ్యాన్స్ చేసిన వీడియోని పోస్ట్ చేసింది. ఐశ్వర్యరాయ్ కి ధీటుగా ప్రగతి వేసిన స్టెప్పులేసి.. ఐశ్ ని మరిపించింది.. ఆహా ఆ నడుము తిప్పడం ఏంటి? ఆ పాటలో జోష్ ఏంటి??ఆ ఎనర్జీ ఏంటి … అని ఆశ్చర్యపోయేలా చేస్తుంది.. కొందరు నోరెళ్లబెట్టి చూస్తుంటే..మరికొందరు ప్రగతి స్టెప్పులను వాహ్ అంటూ పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు..గతంలో లుంగి డ్యాన్స్ పాటకు డ్యాన్స్ వేసిన ప్రగతి..ఇప్పుడు ఈ వీడియోతో సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
సినిమాల్లో ఒక పాత్రల్లో చూసేవారిని అదే దృష్టితో చూస్తూ ఉంటాం..సడన్ గా వారి పర్సన్ లైఫ్ ఇలా ఉంటుంది అని తెలిసేసరికి ఆశ్చర్యపోతుంటాం..ప్రస్తుతం నెటిజన్స్ ప్రగతి విషయంలో అలాంటి ఆశ్చర్యంలోనే ఉన్నారు..అయితే తనకంటూ పర్సనల్ లైఫ్ ఉంటుందని, అందులో తనకు నచ్చినట్టు బతుకుతానని ,డ్యాన్స్ చేయడం చాలా ఇష్టం అని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది..ఆ మధ్య ప్రగతి బిగ్ బాస్ హౌజ్ లోకి రాబోతుందని కామెంట్స్ వచ్చాయి..ఇప్పుడు ఈ వీడియోతో ప్రగతి బిగ్ బాస్ లో ఉంటే బాగుండేది. మామూలు రచ్చ ఉండేది కాదు అని కామెంట్ చేస్తున్నారు.
Actress Pragathi Mind blowing Dance Video | Actress Pragathi Latest dance …