fbpx
NEWS

అలియా బట్ కొత్త ఇళ్ళు చూసారా..! అదిరిపోయే హంగులతో

రాజమౌళి ‘ఆర్‌.ఆర్.ఆర్‌’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నారు బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్. తాజాగా అలియా ఇంటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇటీవల ముంబయిలోని జూహూలో కొత్త ఇల్లు కొన్నారు. ఇన్నేళ్లు అమ్మానాన్నలతో కలిసి ఉన్న ఆమె కొన్ని రోజుల క్రితం కొత్త ఇంటికి షిఫ్ట్‌ అయ్యారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను ఆమె తన యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

‘తొలిసారి నేను ఇల్లు వదిలి, నా సొంత ఇంటికి వచ్చా. నేను కనీసం సినిమాకి వెళ్లాలనుకున్నా తోడుగా నా సోదరిని కూడా తీసుకెళ్తుంటా. తనూ సంతోషంగా వచ్చేది. అందుకే తను కూడా నాతో కొన్ని రోజులు, అమ్మానాన్నలతో కొన్ని రోజులు ఉండాలని నిర్ణయించుకుంది’ అని అలియా తెలిపారు. ప్రస్తుతం అలియా ‘బ్రహ్మాస్త్ర’, ‘సడక్‌ 2’ సినిమాల్లో నటిస్తున్నారు.