fbpx
Entertainment Movies NEWS REVIEWS TOLLYWOOD

అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు మూవీ రివ్యూ రేటింగ్.

నటీనటులు: అజ్మల్, ఆలీ, బ్రహ్మానందం, కత్తి మహేష్, స్వప్న, ధన్ రాజ్ తదితరులు, సంగీతం: రవిశంకర్, కొరియోగ్రఫీ: జగదీష్ చీకటి, నిర్మాత: అజయ్ మైసూర్ , దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ/సిద్దార్థ తాతోలు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా వివాదమే. ఆయన తెరకెక్కించే చిత్రాలు పలు వివాదాలకు కేరాఫ్‌గా నిలవడం మొదట్నుండీ వస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా వర్మ తెరకెక్కించిన మరో వివాదాస్పద చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు. ఏపీ రాష్ట్ర రాజకీయాలను టార్గెట్ చేస్తూ వర్మ తెరకెక్కించిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు వారు అడ్డు చెప్పడంతో అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అంటూ టైటిల్ చేసి నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశాడు. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

 

కథ: ఏపీ రాష్ట్రంలో వెలుగుదేశం పార్టీకి చెందిన బాబు ఎన్నికల్లో ఓడిపోతారు. జగన్నాథ రెడ్డి కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తాడు. అయితే కొత్త సీఎం బాధ్యతలు చేపట్టిన తరువాత పలు హత్యలు జరుగుతాయి. దీంతో జగన్నాథ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేస్తాడు. కట్ చేస్తే ఉపఎన్నికలు రావడంతో విజయం కోసం ఎవరెవరు ఏం చేశారు? ఉపఎన్నికల్లో ఎవరు విజయం సాధించారు? అనేది సనిమా కథ.

విశ్లేషణ:
పూర్తిగా ఏపీ రాజకీయాలను ప్రతిబింబించే ఈ సినిమా కథ కేవలం కల్పితం అంటూ డప్పు కొడుతున్న వర్మ సినిమాలో ఎవరిని టార్గెట్ చేశాడనేది సులువుగా చెప్పవచ్చు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు, పార్టీలను వర్మ టార్గెట్ చేసిన విధానం చాలా వరకు తెలుగు ప్రజలకు నచ్చదు. రాజకీయాల్లో కుట్రలు కుతంత్రాలు సహజమైనా మరీ ఇంతటి స్థాయిలో ఉండకపోవచ్చు అనే నిర్ణయానికి వస్తారు ఈ సినిమా చూస్తే.

ఇక సినిమా కథలో కథ అనేది చాలావరకు మనకు తెలిసిన సంఘటనలు కావడంతో తరువాత ఏం జరుగుతుందో చెప్పేయవచ్చు. చంద్రబాబు, జగన్ మోహన్ రెడ్డి, లోకేష్, పవన్ కళ్యాణ్, కేఏ పాల్ లాంటి పాత్రలను తనకు అనుగుణంగా వాడుకున్నాడు వర్మ. ఈ సినిమాలో హింస కూడా ఎక్కువగా ఉండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో అస్సలు ఆసక్తి కనిపించదు.

 

అటు సినిమాలో కేవలం ఒక వర్గానికి చెందిన వారిని వర్మ టార్గెట్ చేయడంతో మిగతావారు కాస్త సినిమాను ఎంజాయ్ చేయాలని వెళ్తారు. కానీ వారికి కూడా సినిమాలో ఎంజాయ్ చేసే అంశాలు ఏమీ లేకపోవడంతో వారు నిరాశకు లోనయ్యారు. ఓవరాల్‌గా వర్మ తాను ఈ సినిమాతో ఎవరిని ఆకట్టుకోవాలని చూశాడో సినిమా చూసిన జనంకు మాత్రం పెద్ద క్వశ్చన్ మార్క్‌గా మిగిలింది.

నటీనటుల పర్ఫార్మెన్స్:
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాలో నటీనటులు ఎవ్వరూ మనకు కనిపించరు. కేవలం ఆ పాత్రలు మాత్రమే మనకు గుర్తుకువస్తాయి. ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు, జగన్, లోకేష్, పవన్ కళ్యాణ్, కేఏ పాల్ లాంటి పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇక బ్రహ్మానందం, అలీ లాంటి సీనియర్ నటులు ఈ సినిమాలో చెప్పుకోదగ్గ పాత్రలేమీ చేయలేదు. మిగతా వారు ఉన్నా వారితో సినిమాకు ఒరిగింది ఏమీ లేదు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
రామ్ గోపాల్ వర్మ తన శిష్యుడు సిద్దార్థ తాతోలుతో కలిసి ఈ సినిమాను పూర్తిగా ట్రాక్ తప్పించాడనే చెప్పాలి. వర్మ తనదైన మార్క్ సినిమాలు చేయడం మానేశాడని ప్రేక్షకుల్లో ఎప్పటినుండో ఓ మార్క్ పడిపోయింది. దీన్ని అడపాదడపా వర్మ చెరిపేసే ప్రయత్నం చేసినా ఈ సినిమాతో మరోసారి ఆ మార్క్‌ను తొలగించుకోలేక పోయాడు. ఈ సినిమాకు పనిచేసిన టెక్నికల్ డిపార్ట్‌మెంట్‌లో మ్యూజిక్ డైరెక్టర్ రవిశంకర్ కూడా పెద్దగా చేసిందేమి లేదు.

చివరగా:
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు – వర్మ మార్క్ బోరింగ్ సినిమా

రేటింగ్:
2.0/5.0

Add Comment

Click here to post a comment

Your email address will not be published. Required fields are marked *