fbpx
HEALTH NEWS

ప్రజలకు గుడ్ న్యూస్, కరోనా పరీక్ష ఫీజు తగ్గించిన జగన్ ప్రభుత్వం.

పరీక్షల కోసం కిట్లు పెద్ద ఎత్తున అందుబాటులోకి రావటంతోనే పరీక్షల ధర తగ్గిస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టంచేసింది. తగ్గిన ధరల ద్వారా వచ్చే ప్రయోజనాలను ప్రజలకు అందించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కాగా, రాష్ట్రంలో కొత్తగా 61,838 కరోనా పరీక్షలు నిర్వహించారు . దీంతో ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల సంఖ్య 34,18,690 కు చేరుకుంది . రాష్ట్రంలో భారీగా పరీక్షలు నిర్వహించడంతోనే రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువ సంఖ్యలో వెలుగులోకి వస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఏపీలో కరోనా మహమ్మారి చాప కింద నీరులా శరవేగంగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే.

రాష్ట్రంలో ప్రతిరోజూ 8,000కు అటూఇటుగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వం భారీగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి సమయంలో జగన్ సర్కార్ రాష్ట్ర ప్రజలకు తీపికబురు చెప్పింది.

 

కరోనా పరీక్షల రేట్లను తగ్గిస్తూ ప్రభుత్వం నుంచి తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ గతంలో ప్రభుత్వం కరోనా శాంపిల్ టెస్ట్ కు 2,400 రూపాయలు చెల్లించగా ప్రస్తుతం ఆ ధరను 1,600 రూపాయలకు కుదించింది. ప్రైవేట్ ల్యాబ్ లలో కరోనా పరీక్షల కోసం గతంలో 2,900 రూపాయలను నిర్దేశించగా ప్రస్తుతం ఆ ధరను 1,900 రూపాయలకు తగ్గించింది. వైద్య, ఆరోగ్య శాఖ గతంతో పోలిస్తే భారీగా కరోనా కిట్లు అందుబాటులోకి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. వైద్య, ఆరోగ్య శాఖ ఉత్తర్వుల్లో ప్రజలకు ప్రయోజనం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది.

మరోవైపు రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 10,830 కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 3,82,469కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 92,208 యాక్టివ్ కేసులు ఉండగా 3,541 మంది మృతి చెందారు. రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 53,567 కేసులు నమోదు కాగా 40,845 కేసులతో కర్నూలు జిల్లా రెండో స్థానంలో ఉంది,.

The AP government has reduced the price charged by private laboratories for coronavirus testing. Earlier, private labs used to collect Rs 2,400 for testing each sample sent by the AP government. Now, the government has reduced to Rs 1,600. The private labs used to charge Rs 2,900 for testing (each sample) people with Covid symptoms and the same was reduced to Rs 1,900. In this regard, the Medical and Health Department has issued orders. On the other hand, the state government said that prices of corona testing kits reduced due to their availability.