fbpx
NEWS

అయోధ్య పై తీర్పు చెప్పిన సుప్రీం కోర్ట్.

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. వివాదాస్పద స్థలంలో రామ మందిరం కట్టొచ్చని తెలుస్తోంది. మూడు నెలల్లో అయోధ్య చట్టం కింద ట్రస్టును ఏర్పాటు చేయనున్నారు. 2.77 ఎకరాల భూమిని ఆలయ ట్రస్టుకు అప్పగించాలి అని సుప్రీంకోర్టు తెలుపుతుంది. అయిదు ఎకరాల స్థలంలో ముస్లింలు మసీదు కట్టుకోడానికి భూమిని ఇవ్వనున్నారు. దీనిని బట్టి చూస్తే అయోధ్యలో వివాదాస్పద స్థలంలో రామ మందిరం కట్టడం కనిపిస్తోంది.

షియా బోర్డు దాఖలు చేసిన పిటిషన్‌ను, నిర్మోహి అఖాడా దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తీర్పుపై ఐదుగురు న్యాయమూర్తులు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. చరిత్ర, మతపరమైన, న్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని తీర్పు వెలువరింస్తోంది. ఖాళీ ప్రదేశంలో బాబ్రీ మసీదు నిర్మించలేదని పేర్కొన్నారు.

మసీదును ఖాళీ ప్రదేశంలో కట్టలేదని.. అక్కడ ఓ కట్టడం ఉండేదని చెప్పారు. మందిరాన్ని కూల్చి మసీదు కట్టారని మాత్రం పురావస్తు శాఖ ఎప్పుడూ చెప్పలేదని సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. అలాగే నమ్మకం విశ్వాసం ఆధారంగా తీర్పు ఇవ్వలేమని ధర్మాసనం చెప్పుకొచ్చింది. మసీదును ముస్లింలు ఎప్పుడూ వదిలేయలేదు. చాలా మంది చరిత్రకారులు, పర్యాటకులు అయోధ్యను రామ జన్మభూమిగా నమ్ముతున్నారు. ప్రధానమైన డోమ్ కింద రామ జన్మ స్థానం ఉందని అందరూ నమ్ముతున్నారని సుప్రీం కోర్టు చెప్పుకొచ్చింది.

దేశం మొత్తం ఎదురు చూస్తున్న, అయోధ్య పై తీర్పు చెప్పిన సుప్రీం కోర్ట్..

దశాబ్దాలుగా నలుగుతూన్న అయోధ్యలోని రామ జన్మభూమితో పాటుగా, బాబ్రీ మసీదు కేసు వివాదం పై, సుప్రీంకోర్టు తన తుది తీర్పును వేలువడించింది. దేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్న తీర్పుని ఈ రోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ వెలువడించారు. “ఇది ఒక మతానికి సంబంధంచిన అంశంగా చూడడం లేదు. ఇది ఒక భూవివాదంగా చూడనున్నాము. భూవివాదాన్ని చట్టపరంగా చూస్తున్నాము.” అంటూ తీర్పు మొదలు పెట్టరు. ఈ చారిత్రాత్మిక తీర్పు ప్రకారం, వివాదాస్పద స్థలంగా ఉన్న,

2.77 ఎకరాలను హిందువులకి ఇచ్చి, ముస్లింలకు వేరే స్థలం ఇవ్వాలని, ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ కోర్ట్ తీర్పు ఇచ్చింది. దీంతో ఈ స్థలంలో రాముడి గుడి నిర్మాణానికి మార్గం సుగుమం అయ్యింది. ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి, మూడు నెలల్లో విధి విధానాలు చెప్పాలని, కేంద్రాన్ని ఆదేశించింది. 2.77 ఎకరాల వివాదస్పద స్థలంలో, గతంలో హిందువులు పూజలు చేసేవారు అనే ఆనవాళ్ళు ఉన్నాయని, అలాగే ప్రతి శుక్రవారం ఇక్కడ ముస్లింలు ప్రార్ధన చేసే వారని, ఇక్కడ మసీద్ కూల్చివేయటాన్ని కూడా కోర్ట్ తప్పుబట్టింది.

అంతకు ముందు తీర్పు చదవుతూ, ఐదుగురు న్యాయమూర్తులు ఎకాగ్రీవ తీర్పు ఇచ్చారని, రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం అయోధ్య తీర్పును ఏకగ్రీవంగా ఆమోదించినట్టు చెప్పారు. బాబ్రీ మసీద్‌ నిర్మాణ తేదీ పై ఎక్కడా స్పష్టత లేదని కోర్ట్ తెలిపింది. అయితే విగ్రహాలు మాత్రం 1949లో ఏర్పాటు చేస్తినట్టు తెలుస్తుందని కోర్ట్ పేర్కొంది. బాబ్రీ మస్జీద్ ని ఖాళి స్థలం లో నిర్మించలేదని, అక్కడ ఇంతకముందు వేరే బిల్డింగ్ ఉండేదని ఆసి రిపోర్ట్ ద్వారా తెలుస్తోందని అన్నారు.

అక్కడ బౌద్ధమత ఆరామం ఉండేదో, లేక హిందూ దేవాలయం ఉండేదో తెలియడం లేదు. అలాగే మసీద్‌ కింద ఆలయ అవశేషాలు ఉన్నట్లు అర్కియోలజీ డిపార్టుమెంటు గుర్తించిందని కోర్ట్ తెలిపింది. ఈ క్రమంలోనే, షియా వక్ఫ్ బోర్డు, అఖాడా చేసిన వాదనలను సుప్రీం కోర్ట్ తోసిపుచ్చింది. అలాగే యాజమాన్య హక్కులు కోరుతూ షియా వక్ఫ్ బోర్డు వేసిన పిటీషన్ ను కూడా సుప్రీం కోర్ట్ కొట్టేసింది.

అలాగే బాబ్రీ మసీద్ నిర్మాణం పై సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ మాట్లాడుతూ, బాబ్రీ మసీద్ అంతర్గత నిర్మాణం ఇస్లామిక్ శైలిలో లేదని అన్నారు. ఈ వ్యాఖ్యలు సుహస్తు, నిర్మోహి అఖాడా వాదనను కోర్టు తోసిపుచ్చింది. అలాగే, సున్నీ వక్ఫ్ బోర్డు ప్రతిసారి మాటమారుస్తూ వస్తుందని కోర్ట్ తెలిపింది.

మొగల్ చక్రవర్తి అయిన బాబర్ దగ్గర పని చేసిన, సైనికాధికారులు మసీదును నిర్మించారనే ఆధారాలు ఉన్నాయని అన్నారు. మరో పక్క దేశంలో ఎక్కడా శాంతి భద్రతలు అదుపు తప్పకుండ, కేంద్రం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. అసాంఘిక శక్తులు ఎలాంటి కుట్రలకు పాల్పడకుండా, అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి రాష్ట్రాన్ని స్వయంగా పర్యవేక్షణ చేస్తూ, కేంద్ర హోం శాఖ ఎప్పటికప్పుడు, పరిస్థితిని పర్యవేక్షణ చేస్తుంది.

Ayodhya verdict: Supreme Court orders allotment of alternati ..

Ayodhya Case Final Verdict Declared.. #AyodhyaVerdict #AyodhyaJudgment #ayodhyaverdict #AyodhyaHearing #RamMandir