fbpx
NEWS

జాగ్రత్తగా లేకుంటే మీ మనీ గోవిందే.. ATM వద్ద జాగ్రత్తగా ఉండండి

బ్యాంకు అకౌంట్లో డబ్బులు విత్ డ్రా చేయాలంటే చాలు.. దగ్గరలోని ఏటీఎంకు పరిగెత్తుతుంటారు. నగదు విత్ డ్రా చేయాలన్న తొందరలో తెలిసో తెలియక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఏటీఎంలో సీసీ కెమెరా ఉందిగా మోసగాళ్లు ఎలా మాయ చేస్తారులే అని భ్రమపడుతుంటారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఎంతో విలువైన నగదును కోల్పోతారు జాగ్రత్త అంటున్నారు నిపుణులు. ఏటీఎంలో నగదు విత్ డ్రా చేసే సమయంలోనే ఎక్కువగా మోసాలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలోని ఓ బ్యాంకు ఏటీఎంలో నగదు ట్రాన్స్ జెక్షన్ మోసానికి పాల్పడిన ఇషా ఖాన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ కొత్త కేసు వెలుగులోకి వచ్చింది. ఉప పట్టణాల్లోని ఏటీఎం సెంటర్లలో నగదు విత్ డ్రా చేసేవారినే మోసగాళ్లు టార్గెట్ చేస్తున్నారని ఓ నివేదిక తెలిపింది.పెద్దగా చదువుకోనివారినే మోసగాళ్లు లక్ష్యంగా చేసుకుని డబ్బులు కాజేస్తున్నట్టు తేలింది.

సెక్యూరిటీ గార్డులేని ఏటీఎం సెంటర్లు, నాన్ ఫంక్షనల్ ఏటీఎం సెంటర్లనే నేరగాళ్లు ప్రధానంగా ఫోకస్ పెడుతున్నారట. ఇలాంటి ఏటీఎం సెంటర్లలోకి నగదు కోసం వచ్చే అవగాహన లేనివారిపైనే వీరి గురి ఉంటుంది.వారికి సాయం చేస్తున్నట్టుగా నటిస్తూనే నమ్మించి అకౌంట్లలో నగదు కాజేస్తున్నారు. ATM లోకి బాధితులు వెళ్లేంత వరకు మోసగాళ్లు ఎదురుచూస్తారు. వారు వెళ్లగానే వెంటనే లోపలికి వెళ్లి వెనుక నిలబడతారు. బాధితులు ఏటీఎం పిన్ నెంబర్ ఎంటర్ చేయడం చూసి సీక్రెట్ గా నోట్ చేసుకుంటారు. ఒకవేళ నగదు విత్ డ్రా చేసే వ్యక్తి ట్రాన్స్ జెక్షన్ విఫలమైతే చాలు.. వెంటనే సాయం చేస్తున్నట్టుగా నటిస్తారు. బాధితుల నుంచి ఏటీఎం కార్డును తీసుకుని వారిని మాటల్లో పెడతారు.తెలివిగా ఒరిజినల్ ఏటీఎం కార్డు స్థానంలో క్లోనింగ్ (ఫేక్) ఏటీఎం కార్డును మార్చేస్తారు. మీ అకౌంట్ ట్రాన్స్ జెక్షన్ కావడం లేదని, మరో ఏటీఎంకు వెళ్లి ట్రై చేయమని మెల్లగా చెబుతారు. కార్దుదారులు అది నమ్మి అక్కడి నుంచి వెళ్లిపోగానే అసలైన ఏటీఎం కార్డుతో నగదు విత్ డ్రా చేసి అక్కడి నుంచి ఊడాయిస్తారు. అందుకే.. ఏటీఎం కార్డును ఎప్పుడూ కూడా అపరిచితులకు ఇవ్వకూడదు. ఏటీఎం పిన్ ఎంటర్ చేసే సమయంలో ఎవరికి కనిపించకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి.

అప్పుడే మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది. ఏటీఎం PIN ఎప్పుడూ గుర్తించుకోవాలి. కార్డులపై సహా ఎక్కడా పిన్ నెంబర్ రాయడం చేయకూడదు.,  ఏటీఎం కార్డు నెంబర్, పిన్ నెంబర్, CVV నెంబర్లను బ్యాంకు అధికారులు సహా ఎవరికి ఇవ్వకూడదు.,మోసాల బారిన పడకుండా ఉండాలంటే.. తరచుగా ఏటీఎం కార్డు పిన్ నెంబర్ మారుస్తుండాలి., కన్ఫ్యూజ్ లేకుండా ఉండాలంటే.. గుర్తుండేలా పిన్ నెంబర్ సెట్ చేసుకోవాలి పుట్టిన తేదీ, వాహనం నెంబర్, ఫోన్ నెంబర్లను ఏటీఎం పిన్ నెంబర్ గా ఎప్పుడూ పెట్టుకోవద్దు. ATMలో నగదు డ్రా చేస్తే.. ఏటీఎం లేదా PoS మిషన్ లో స్వైప్ చేస్తే దగ్గరగా నిలబడాలి. పిన్ నెంబర్ ఎంటర్ చేసే కీ ప్యాడ్ పై మరో చేతిని అడ్డంగా పెట్టి పిన్ ఎంటర్ చేయాలి.,. మీరు నగదు విత్ డ్రా చేసే సమయంలో మీ పక్కన ఇతరులు లేకుండా చూసుకోవాలి., . ATM లో డబ్బులు డ్రా చేసేటప్పుడు కొత్తవారితో మాట్లాడొద్దు. ఎవరికి మీ కార్డును ఇవ్వరాదు., . ATMకు ఏదైనా డివైజ్ కనెక్ట్ అయి ఉన్నట్టు గుర్తిస్తే వెంటనే ట్రాన్స్ జెక్షన్ ఆపేయండి.,. ఏటీఎం గార్డు లేదా బ్యాంకు అధికారులకు సమాచారం అందించండి.,  నగదు విత్ డ్రా పూర్తి కాగానే.. Cancel బటన్ నొక్కడం మరవద్దు.,.

ATMలో Welcome Screen వచ్చే వరకు ఏటీఎం సెంటర్ వదిలివెళ్లొద్దు., . ATM కార్డు కోల్పోయినా లేదా ఎవరైనా దొంగలించినా.. సదరు బ్యాంకుకు వెంటనే రిపోర్ట్ చేయాలి.,. అకౌంట్ బ్రాంచ్ కు లేదా ఆ బ్యాంకు కస్టమర్ కేర్ కు కాల్ చేసి కార్డు బ్లాక్ చేయమని చెప్పండి.,. మీరు నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ బ్యాంకింగ్ సర్వీసు వాడుతున్నట్టుయితే మోసపూరిత ట్రాన్స్ జెక్షన్ కాకుండా ముందు జాగ్రత్త చర్యగా మీ ఏటీఎం కార్డును మీరే బ్లాక్ చేసుకోవచ్చు.