fbpx
Celebrities Entertainment NEWS TOLLYWOOD

బిగ్ బాస్ 4 కంటెస్టెంట్స్ ఫైనల్ లిస్ట్ వచ్చేసిందోచ్

తెలుగు బుల్లితెర పై బిగ్ బాస్ షో ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఇప్పటికే మూడు సీసన్ లు పూర్తి చేసుకున్న ఈ ప్రతిష్టాత్మకమైన షో ఇప్పుడు నాల్గవ సీసన్ కోసం ముస్తాబు అవుతుంది. మొదటి మూడు సీసన్ లకు ఎన్టీఆర్ ,నాని ,నాగార్జునలు వ్యాఖ్యాతలుగా వ్యవహరించగా నాల్గవ సీసన్ కి మళ్ళీ అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తాడు అని జోరుగా ప్రచారం సాగుతోంది..ఇటీవలే ఆయన తాను ఈ షో చెయ్యబోతున్నట్లు కూడా తన ట్విట్టర్మ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.మరో వైపు మెగాస్టార్ చిరంజీవి కూడా రాబొయ్యే బిగ్ బాస్ 4 షో కి వ్యాఖ్యాతగా వ్యవహరించే అవకాశం ఉంది అని అప్పట్లో జోరుగా ప్రచారం సాగింది.

కానీ అవన్నీ గాసిప్స్ అని నిన్న ట్విట్టర్ లో నాగార్జున పెట్టిన ట్వీట్ తో అందరికి స్పష్టంగా అర్థం అయ్యింది అయితే ఈసారి ఈ షో లో పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్స్ వీళ్ళే అని సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం సాగుతోంది.వాల్లెవరెవరో ఇప్పుడు మనం చూద్దాము.గతం లో పలువురు బడా హీరోలతో నటించి కొంతకాలం పాటు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా చలామణి అయిన పూనమ్ బాజ్వా ఈ బిగ్ బాస్ 4 షో లో ఒక్క కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేయబోతుంది అట.

ఇక ఈ షో లో పార్టిసిపేట్ చెయ్యబోతున్న మరో కంటెస్టెంట్ శ్రద్ధ దాస్.హీరోయిన్ గా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయినా సెకండ్ హీరోయిన్ రొల్స్ మరియు లేడీ విలన్ రొల్స్ కి ఈమె బాగా పాపులర్ అయిన సంగతి మన అందరికి తెలిసిందే.ఇప్పుడు ఈమె కూడా బిగ్ బాస్ 4 లో పార్టిసిపేట్ చేయబోతుంది.ఇక ఈ షో లో పార్టిసిపేట్ చెయ్యబోతున్న మరో హీరోయిన్ హంస నందిని.

ఇక యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ తో సంచలనం సృష్టించిన వైవా హర్ష ,మరియు మహాతల్లి కూడా ఈ షో లో కంటెస్టెంట్స్ గా పార్టిసిపేట్ చెయ్యబోతున్నారు అట.బిగ్ బాస్ 2 రన్నర్ మరియు ప్రముఖ సింగర్ గీత మాధురి భర్త నందు కూడా బిగ్ బాస్ 4 షో లో పాల్గొనబోతున్నాడు.వీళ్ళతో పాటు ప్రముఖ సింగర్ నోయల్ ,జబర్దస్త్ నరేష్ ,యామిని భాస్కర్ ,అపూర్వ ఇలా దాదాపు 15 మంది కోనెటస్టెంట్స్ తో ఈ షో నడవనుంది

ఇది ఇలా ఉండగా ప్రముఖ నటుడు తరుణ్ కూడా ఒక్క కంటెస్టెంట్ గా ఉండబోతున్నారు అని సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం సాగింది..అయితే అలాంటిది ఏమి లేదు అని హీరో తరుణ్ ఒక్క ప్రెస్ నోట్ అధికారికంగా విడుదల చేసారు…అయితే మొదటి మూడు సీసన్ లు 100 రోజులకు పైగా కొనసాగగా రాబొయ్యే నాల్గవ సీసన్ మాత్రం కేవలం 50 రోజులు మాత్రమే కొనసాగనుంది అట..

యావత్తు తెలుగు ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ బిగ్ బాస్ 4 షో ఎంత పెద్ద హిట్ అవుతుందో తెలియాలి అంటే మరి కొద్దీ రోజులు వేచి చూడాల్సిందే, అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ షో ఆగస్టు 15 నుండి ప్రారంభం అవ్వబోతుంది అట..దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.