fbpx
NEWS TOLLYWOOD

బిగ్ బాస్ మరో సర్ ప్రైజ్.. హౌస్ లోకి జబర్దస్త్ నటుడు

గత రెండు సీజన్లతో పోలిస్తే ప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న క్రేజీ షో, బిగ్ బాస్ సీజన్ 3 మరింత రసవత్తరంగా సాగుతోందని అంటున్నారు విశ్లేషకులు. ఇక ఈ లేటెస్ట్ సీజన్ కు భారీ స్థాయిలో వీక్షకుల ఆదరణతో పాటుగా రేటింగ్స్ కూడా అద్భుతంగా వస్తున్నాయట. ఇక ఈ సీజన్ ను మరింత రంజింప చేసేందకు బిగ్ బాస్, తమ పార్టిసిపెంట్స్ కు మరిన్ని వినూత్నమైన టాస్కులు కూడా ఇవ్వడం జరుగుతోంది.ఇక ఇటీవల ఈ షోలోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన తమన్నా సింహాద్రి ఎంట్రీ తరువాత షోలో మరింత కిక్ వచ్చిందని, ఇక రాబోయే రోజుల్లో ఈ షోలో మరిన్ని సర్ప్రైజ్ లు రాబోతున్నాయని అంటున్నారు.

అయితే ఈ షో విషయమై నేడు ఒక వార్త విపరీతంగా పలు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతోంది. అదేమిటంటే, త్వరలో ఈ షోలోకి జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్ స్పషల్ అపియరెన్స్ ఇవ్వబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. కానీ ఎంటర్ అవ్వబోతోంది వైల్డ్ కార్డు ఎంట్రీ తో కాదట, తన లేటెస్ట్ మూవీ ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ అనే సినిమా త్వరలో విడుదలకు సిద్ధం అవుతుండడంతో ఆ సినిమా ప్రమోషన్ కోసం సుధీర్ ఒకరోజు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి హౌస్ లోని పార్టిసిపెంట్స్ తో సందడి చేయబోతున్నట్లు సమాచారం. గతంలో ఎన్టీఆర్ హోస్ట్ గా వున్న సమయంలో ఆయన హీరోగా నటించిన జైలవకుశ సినిమా,అలానే నాని హోస్ట్ గా వ్యవహరించిన సమయంలో తాను నటించిన దేవదాస్ సినిమాలను కొంత బిగ్ బాస్ షో ద్వారా వారు కూడా ప్రమోట్ చేసుకున్న విషయం తెలిసిందే.

తమ సినిమా ప్రమోషన్ విషయమై ఇటీవల సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమా నిర్మాతలు బిగ్ బాస్ నిర్వాహకులను అలానే హోస్ట్ నాగార్జునను కలిసి మాట్లాడినట్లు చెప్తున్నారు. ఇక మరికొద్దిరోజుల్లోనే సుధీర్ సడన్ ఎంట్రీ బిగ్ బాస్ హౌస్ లో ఉండనుందని దీన్నిబట్టి తెలుస్తోంది. అయితే ప్రస్తుతం విపరీతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తలపై అధికారిక ప్రకటన వెలువడవలసి ఉంది…..!!