fbpx
NEWS VIDEOS

ఫ్లై ఓవర్‌ పై నుంచి కింద పడ్డ కారు..

మిలాన్ అనే వ్యక్తి కారు డ్రైవ్ చేస్తున్నాడు. డ్రైవర్ నిర్లక్ష్యం, అతి వేగంగా డ్రైవ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఫ్లైవోవర్ కింద ఆటో కోసం ఎదురు చూస్తున్న మహిళపై కారు పడటంతో అక్కడికక్కడే చనిపోయింది. ఆమె కూతురితోపాటు ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఫ్లైఓవర్‌ స్పీడ్ కు మించి వేగంతో కారు వెళ్తోంది. కారు 100కు పైగా స్పీడ్ ఉండటంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. 40 స్పీడ్ వెళ్లాల్సిన డ్రైవర్ ఓవర్ స్పీడ్ వెళ్తున్నారు. సినిమా షూటింగ్ తరహాలో కారు బోల్తా పడి, చెట్టును ఢీకొట్టడంతోపాటు మహిళపై పడటంతో స్పాట్ లోనే మృతి చెందింది. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.

 

అతి వేగమే ప్రమాదానికి కారణమా, లేదా వేరే కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత నెల 10వ తేదీన ఇదే ప్లైఓవర్‌ పైనుంచి బైక్‌ కిందపడిన ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటనపై మంత్రి కె.తారకరామారావు కూడా స్పందించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక నిర్ధారణలో తేలిందన్నారు. ఈ క్రమంలో వేగ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని జీహెంఎంసీ చీఫ్‌ ఇంజనీర్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. కాగా ఇటీవల నూతనంగా ప్రారంభించిన బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఘోర ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

 

ఫ్లై ఓవర్‌పై నుంచి ఓ కారు పల్టీలు కొట్టి కిందపడిన ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. యాక్షన్‌ సినిమా గ్రాఫిక్స్‌ మాదిరి ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ప్రమాద విజువల్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కాగా ప్రమాద సమయంలో కారు గంటకు 104 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయినట్లు సమాచారం. ఘటనాస్థలం మొత్తం విషాదకర దృశ్యాలతో నిండిపోయింది.

Add Comment

Click here to post a comment

Your email address will not be published. Required fields are marked *