fbpx
NEWS POLITICS

నేను కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్న, ఐపీఎస్ అయ్యి నేనేంటో చూపిస్తా : కానిస్టేబుల్ సునీత

గుజరాత్ ఆరోగ్య శాఖ మంత్రి కుమార్ కనానీ కుమారుడు ప్రకాశ్ కనానీ స్నేహితులు. పోలీసులు ప్రశ్నిస్తుండగానే వారిలో ఒకరు ప్రకాశ్ కనానీకి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన తన కారులో వచ్చి వారిద్దరినీ తన వెంట తీసుకెళ్లిపోయారు. ఇది సునీతా యాదవ్‌కు ఆగ్రహం తెప్పించింది. వెంటనే ప్రకాశ్ కనానీకి ఫోన్ చేసి నిలదీశారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని ఎలా సమర్థిస్తారని, తన విధులను ఎలా అడ్డుకుంటారని ప్రకాశ్ కనానీని సునీతా యాదవ్ ప్రశ్నించారు. నేనెవరో తెలుసా? తెలిసే మాట్లాడుతున్నావా? అంటూ అవతలి నుంచి బెదిరింపు వచ్చింది. ‘మాకు పవర్ ఉంది. నేను తలుచుకుంటే నా మిత్రులను నువ్వు ఎక్కడ నిలబెట్టావో అక్కడే 365 రోజులూ నిలబెట్టగలను’ అని వార్నింగ్ ఇచ్చారు.

 

కర్ఫ్యూ నిబంధనలను పట్టించుకోకుండా అర్ధరాత్రి రోడ్డుపైకొచ్చిన మంత్రి కుమారుడిని నిలదీసిన ఘటనతో పెద్ద ఉద్యోగంలోనే పవర్ ఉంటుందని నేర్చుకున్నానని మహిళా కానిస్టేబుల్ సునీతా యాదవ్ చెప్పారు.

ప్రస్తుతం కానిస్టేబుల్ గా ఉన్నందున తనను ఎవరూ పట్టించుకోవడం లేదని, అదే ఐపీఎస్ అధికారిగా వచ్చానంటే ఆ కిక్కే వేరుగా ఉంటుందంటున్నారు. సివిల్స్ కు ప్రిపేర్ అయ్యేందుకుగాను ఇప్పుడు చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని, ఐపీఎస్ అయిన తర్వాతనే తిరిగి పోలీసు డిపార్ట్మెంట్లోకి వస్తానని ఎంతో ఆత్మస్థైర్యంతో చెప్తున్నారు. కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా సూరత్ లో ఆరోగ్య శాఖ మంత్రి కుమారుడు ప్రకాష్ కనానితోపాటు అతడి ఇద్దరు స్నేహితులను మహిళా కానిస్టేబుల్ సునీతా యాదవ్ నిలదీసిన విషయం తెలిసిందే.

 

ఈ నేపథ్యంలో విచారణ జరిపిన పోలీసు ఉన్నతాధికారులు మంత్రి కొడుకు సహా మరో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. అనంతరం వారు బెయిల్ పై బయటకొచ్చారు. ఈ ఘటన తరువాత సునీతా యాదవ్‌ని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కి బదిలీ చేశారు. ఈ క్రమంలో ఉద్యోగానికి రాజీనామా చేయాలని సునీతా యాదవ్ నిర్ణయించుకున్నారు. మంత్రి అనుచరుల నుంచి ముప్పు ఉన్నందున రక్షణ కల్పించాలని పోలీసు ఉన్నతాధికారులను ఆమె కోరారు.

 

సునీతా యాదవ్ గుజరాత్ లోని లోక్ రక్షక్ దళ్ లో కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నారు. మంత్రి కుమారుడి నుంచి బెదిరింపు ఫోన్లు రావడంతో ఆమె ఇంటి వద్ద పోలీసు కాపలా పెట్టారు.