fbpx
HEALTH Info NEWS VIDEOS

నాకు కరోనా వచ్చింది, వాడిన మెడిసిన్ ఇదే

నాకు కరోనా వచ్చింది, వాడిన మెడిసిన్ ఇదే

కరోనా వైరస్ కారణంగా వచ్చే కోవిడ్-19 వ్యాధి చికిత్సకు మందులు అభివృద్ధి చేసేందుకు భారత్‌ ఎప్పుడో ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇతర వ్యాధుల కోసం అభివృద్ధి చేసి.. మధ్యలోనే ప్రయోగాలను ఆపేసిన వందలాది మందులను హైదరాబాద్‌లోని ఐఐసీటీ స్క్రీన్‌ చేసి పనికొస్తాయని భావించిన మూడింటిని వేరు చేసింది.

అందులో ఎబోలా వైరస్‌ కోసం అమెరికన్‌ కంపెనీ గిలియాడ్‌ అభివృద్ధి చేసిన రెమిడెస్‌విర్, సాధారణ జలుబు కోసం జపనీస్‌ కంపెనీ తయారు చేసిన ఫావిపిరావిర్‌తో పాటు మలేరియా చికిత్సకు వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌లు ఉన్నాయి. ఇవి కరోనా చికిత్సకూ ఉపయోగపడతాయని ఐఐసీటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇదే సమయంలో ఆ మందులను తయారు చేసి ఇస్తే తాము వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేస్తామని ఫార్మా కంపెనీ సిప్లా ప్రకటించింది.

అయితే మానవ ప్రయోగాల దశకు చేరుకునేటప్పటికి వివిధ కారణాల వల్ల ప్రాజెక్టు ఆలస్యం అయ్యింది. భారత్‌లోని రోగులపై ప్రయోగించడం ద్వారా మాత్రమే వాటి పనితీరును గమనించాలని డ్రగ్‌ కంట్రోలర్‌ నిర్ణయించడం దీనికి ఒక కారణం. ఇందుకు తగ్గట్టుగా సిప్లాతోపాటు గ్లెన్‌మార్క్‌ కూడా మొత్తం ఏడు ఆసుపత్రులతో ఒప్పందాలు చేసుకున్నాయి. అయితే కరోనా రోగులతో వైద్యులు క్షణం తీరికలేని పరిస్థితులు ఏర్పడటం.. ఈ మందులను రోగులకు ఇచ్చి వాటి ఫలితాలను, సమాచారాన్ని నమోదు చేసే అవకాశం లేకపోవడంతో ఇంకాస్త ఆలస్యమైంది.

కొత్త మందులను ఉపయోగించేందుకు రోగులు కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు. చివరకు రెండు కంపెనీలు వేర్వేరుగా నిర్వహించిన ప్రయోగాల సమాచారాన్ని జోడించి డ్రగ్‌ కంట్రోలర్‌కు అందించగా.. డ్రగ్‌ కంట్రోలర్‌ ఈ సమాచారాన్ని విశ్లేషించి అనుమతులిస్తే కరోనాపై పోరుకు భారత్‌లోమందులు వచ్చినట్లే. ఇందుకు మరో నాలుగు వారాలు పట్టవచ్చని అంటున్నారు.

ఈ మందులను ఉపయోగించిన 100 మంది రోగుల్లో కనీసం 60–70 శాతం మంది పరిస్థితి మెరుగు కాగా, మిగిలిన వారిలో పెద్దగా దుష్ఫలితాలు కనిపించలేదు. వైరస్‌ సోకిన తొలినాళ్లలో లేదా తేలికపాటి నుంచి ఓ మోస్తరు లక్షణాలు మాత్రమే ఉన్న రోగులకు ఫావిపిరావిర్, మధ్యమ స్థాయి నుంచి తీవ్ర లక్షణాలు ఉన్న వారికి రెమిడెస్‌విర్‌ వాడటం మంచిదన్న అంచనా బలపడింది.

WATCH VIDEO