fbpx
NEWS VIDEOS

రషీద్ ఖాన్ లైఫ్ స్టోరీ…

రషీద్ ఖాన్..19 ఏళ్ళకే ఆఫ్ఘనిస్తాన్ అంతర్జాతీయ జట్టుకు కెప్టెన్ గా సారధ్యం వహించిన ఆటగాడు…2018 లో సన్ రైజర్స్ ఫైనలు కు చేరడంలో కీలక పాత్ర వహించిన గొప్ప ఆటగాడు..రషీద్ ఖాన్ పూర్తి పేరు రషీద్ అర్మాన్ ఖాన్..ఇతను 1998 సెప్టెంబర్ 28 న ఆఫ్ఘనిస్తాన్లోని నాం గర్హార్ లో జన్మించాడు..ఇతడి తండ్రికి మొత్తం పది మంది సంతానం..అందులో పెద్దవాడైన అమీర్ ఖానే తనకు స్పిన్ లో స్పూర్థి అని రషీద్ చెప్పడం గమనిస్తుంటాం..2001 లో రషీ కుటుంబం ప్రాణాలను కాపాడుకోవడానికి ఆఫ్ఘనిస్తాన్ వదిలి పాకిస్తాన్ కు వెళ్ళాల్సి వచ్చింది..పాకిస్తాన్ లో కొన్ని సంవత్సరాలు ఉండి మళ్ళీ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ కు తిరిగి వచ్చారు..రషీద్ ఖాన్ ఇంట్లో అబ్బాయిలు ఎక్కువగా ఉండడం వలన వాళ్ళంతా ఇంట్లోనే క్రికెట్ ఆడుతుండే వాళ్ళు..

 

వాల్లన్నయ్య దగ్గర స్పిన్ కు తగిన అనేక ట్రిక్స్ నేర్చుకున్నాను అని వాళ్ళే నాకు మంచి సూచనలు ఇస్తారని రషీద్ చెప్తుంటాడు..రషీద్ ఖాన్ కు పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది అంటే చాలా ఇష్టం..అతడిలాగానే బౌలింగ్ నేర్చుకున్నాడు..రషీద్ ఖాన్ మొదటి ఇంటర్నేషనల్ మ్యాచ్ ను 2015 అక్టోబర్ 18 న జింబాబ్వేపై ఆడాడు..2017 మార్చి 10 న ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్లో ఇతడు 2 ఓవర్లు వేసి 3 పరుగులిచ్చి ఏకంగా 5 వికెట్లు తీసాడు..అంతే కాకుందా ఇతన్ని అతి చిన్న వయసులోనే ఆఫ్ఘనిస్తాన్ అంతర్జాతీయ టీం కు కెప్టెన్ గా సెలక్ట్ అయి ఇంటర్నేషనల్ రికార్డును నెలకొల్పాడు..2017 ఐపిఎల్ లో రషీద్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ 4 కోట్లకు కొన్నది..ఆ 2017 లో రషీద్ సన్ రైజర్స్ తరపున 14 మ్యాచ్లు ఆడి 17 వికెట్లు తీసాడు..2018 లో రషీద్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ 9 కోట్లకు దక్కించుకుంది.

2018 లో సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఫైనల్స్ కు చేర్చడంలో రషీద్ ఖాన్ ఎంతో కీలక పాత్ర వహించాడు..ఇతను 16 మ్యాచ్లు ఆడి 21 వికెట్లు తీసి 2018 లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రెండో స్థానంలో నిలిచాడు..ఇప్పుడు అదే ఆటను కొనసాగిస్తూ వస్తున్నాడు రషీద్ ఖాన్..రషీద్ ఖాన్ రియల్ లైఫ్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో చెప్పండి..

ఈ క్రింది వీడియో చూడండి

You may also like