fbpx
Entertainment Info NEWS

నాన్న వ‌దిలి వెళ్లారు., అమ్మ రెట్టింపు బాధ్య‌త‌ల‌తో కుటుంబాన్ని న‌డిపింది.! అప్పుడే డిసైడ్ అయ్యాను.!

నాకు ఐదేళ్ల వయసప్పుడు ఆఫీస్ కి వెళ్లిన నాన్న తిరిగిరాలేదు..ఒకటి రెండు రోజులు ఎదురుచూసాం.. నాన్న ఎందుకు రాలేదో ఆ ఏజ్లో తెలీదు.. మొత్తానికి ఆరు నెలల తర్వాత నాన్న ఇంటికి వచ్చారు..కానీ , అప్పటికే అమ్మ ఇంటి బాధ్యతలను తన భుజాన వేసుకుంది..బట్టలు కుడుతూ ఇంటి బాధ్యత చూసుకునేది.. నాన్న తిరిగి వచ్చిన తర్వాత అమ్మ కష్టం తీరలేదు..రెట్టింపు అయింది..

నాన్న ఉద్యోగానికి వెళ్తున్నారు..ఇంట్లో తన జీతం ఇవ్వట్లేదు..అన్ని అమ్మే చూసుకుంటుంది..మాకు అర్ధం అయ్యేది కాదు.. నేను, అక్క అమ్మకి మా వంతుగా హెల్ప్ చేసేవాళ్లం..మేం హైస్కూల్ ఏజ్ కి వచ్చే సరికి అమ్మ మా చదువుల కోసం బట్టలు కుట్టగా వచ్చిన డబ్బులు చాలట్లేదని ఎల్ఐసి పాలసిలు కట్టించడానికి కష్టపడేది..ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు ఒకసారి మా నాన్నని 100రూ. కావాలి వాచ్ కొనుక్కుంటాను అంటే ..నా చేతిలో ఐదు రూపాయలు పెట్టి , నా కజిన్ బ్రదర్ కి వాచ్ కొనిచ్చారు..ఇది పెట్టుకోవడానికి అబ్బాయిలకు మాత్రమే అర్హత ఉంటుంది అన్నారు…

 

ఇదే విషయం అమ్మకి చెప్తే, సాయంత్రానికి నేను కోరుకున్న వాచ్ కొనిచ్చి వెళ్లి మీ నాన్నకు చూపించు అంది అమ్మ, వాచ్ పెట్టుకోవడానికి ఆడామగా తేడా అక్కర్లేదన్నది నిరూపించాలని అమ్మ ఆరాటం..కేవలం వాచ్ విషయంలోనే కాదు, మా చదువుల విషయంలో కూడా ఇంట్లో అమ్మ పోరాటం చేయాల్సొచ్చింది.నా బోర్డ్ ఎగ్జామ్స్ అయిన రెండురోజులకే రీసెర్చ్ మార్కెటర్ గా ఉద్యోగం వచ్చింది.. నెలకు 2000జీతం..మొదటి నెల జీతం అందుకోగానే అమ్మ చేతిలో పెట్టా..గ్రాడ్యుయేషన్ చదువుతూ, ఉద్యోగం చేస్తూ.. వచ్చిన సంపాదనతో డ్యాన్స్ క్లాస్లో జాయిన్ అయ్యా..చిన్నప్పటి నుండి డ్యాన్స్ అంటే ఇష్టం ఉన్నా స్థోమత లేక నేర్చుకోలేదు..కానీ ఈ సారి పట్టుదలగా నేర్చుకున్నా..చిన్నచిన్న ఈవెంట్స్ చేస్తూ అదనపు సంపాదన..ఇంట్లో అవసరమైన ఖర్చులకు నేనే డబ్బులివ్వడం సంతోషంగా ఉండేది..గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్లో ఉండగా ఒక పెద్ద కంపెనిలో సేల్స్ ఎగ్జిక్యుటివ్ గా ఉద్యోగం వచ్చింది..

ఇంటర్వ్యూలో కంపెని సిఇఒ ఒక క్వశ్చన్ అడిగారు..నీ డ్రీమ్ ఏంటని.. మరో రెండేళ్లల్లో ఇంటర్నేషనల్ స్థాయికి ఎదగాలి అని సమాధానం ఇచ్చా..పెద్దకలలే కంటున్నావు అని నవ్వారు..నాకు తెలుసు ఆ కలలు నిజం చేసుకోగలను.. అనుకున్నట్టుగానే కలలు నిజం చేస్కున్నాను..కంపెనిలో అంచెలంచెలుగా ఎదిగాను.. అమ్మకి ఒక ఇల్లు బహుమతిగా ఇచ్చాను..

మా నాన్న మమ్మల్ని ఎందుకు వదిలి వెళ్లారో నాకు ఐదేళ్లప్పుడు అర్దం కాలేదు, తర్వాత అర్ధం అయింది..అప్పుడే నేను మా అక్క నిర్ణయించుకున్నాము.ఆడవాళ్ల శక్తి ఏంటో తనకు చూపించాలని..అంతేకాదు ఇకపై మా అమ్మని కష్టపెట్టకూడదు..తన నుండి పైసా కూడా ఆశించొద్దు అని..రెండు కలలు నెరవేరాయి..ఇప్పటికి మా అమ్మ కష్టపడుతూనే ఉంది.. “ఈ సారి తనకోసం తన పిల్లల కోసం కాదు, ఒక NGO స్థాపించి,దాని ద్వారా గృహహింస ఎదుర్కొంటున్న ఆడవాళ్లకు అండగా నిలబడి వారికోసం,వారి తరపున పోరాడుతుంది.”