fbpx
Food & Drinks HEALTH NEWS

వారం రోజులు ఇలా చేస్తే జీవితాంతం బ్రతికేస్తారు

మహాత్మాగాంధీ ‘ గ్రామస్వరాజ్‌’ ‘స్వాతంత్రోద్యమం’,‘అస్ప్రశ్యత’, ‘ఖాదీ’ వంటి ఎన్నో అంశాలను ప్రపంచం దృష్టికి తెచ్చినవారు. అట్లాగే ‘ప్రకృతి చికిత్స’కు వారే‘ అంబాసిడర్‌’గా ఉండి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. స్వయంగా మనుషులకే కాదు జంతువులకు కూడా ప్రకృతి చికిత్స అందజేసి సమకాలికులకు ఆదర్శ నాయకులయ్యారు. ద్రోణంరాజు వెంకటచలపతి శర్మ జర్మనీ భాషలో ఉన్న ప్రకృతి చికిత్సా విధానానికి సంబంధించిన పుస్తకాలను తెనిగించి ఆ చికిత్సను 1890లోనే మనకు పరిచయం చేశారు. ఆ తర్వాత 1933లో గుంటూరు జిల్లాలో ప్రకృతి ఆశ్రమాన్ని డా. వేగిరాజు కృష్ణంరాజు స్థాపించారు. అది 1944 నుంచి భీమవరంలో శ్రీ రామకృష్ణ ప్రకృతి ఆశ్రమం పేరిట స్థిరపడి శాఖోపశా ఖలుగా విస్తరించింది. ఇప్పుడు వేగిరాజు కుటుంబీకులైన డా.రవివర్మ, డా. కమలాదేవి, డా.గోపాలరాజు మొదలైనవారు సేవలందిస్తున్నారు.ప్రకృతి నుంచి దూరం జరిగే కొద్ది మనిషిలో వికృతి పెరుగుతుంది. ఈ వికృతి శరీరంలోనూ, మనసులోనూ చోటు చేసుకోవడంతో అనారోగ్యం మొదలవుతుంది. ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆరోగ్యం అంటే ఏంటో నిర్వచించింది.

కేవలం రోగం లేకపోవడం లేదా వైల్యం లేకపోవడమే ఆరోగ్యం అనిపించుకోదు. భౌతికంగా, సామాజికంగా కూడా సంపూ ర్ణంగా స్వస్థత కలిగి ఉండడమే ఆరోగ్యం. ఈ నిర్వచనాన్ని ఆధారంగా చేసుకుని ప్రకృతి వైద్యవిధాన శాస్త్ర అంశాలను మేళవించి చాలా వరకు సంఘసేవా దృష్టితో ప్రజలకు సేవలందిస్తున్న అసలైన ఆరోగ్య కేంద్రాలు ప్రకృతి చికిత్సాలయాలు. గత కొని సంవత్సరాలుగా యోగా కూడా ఈ వైద్యవిధానంలో ఒక భాగమైంది.ముందులు వేయకుండా జబ్బులను నయం చేయడం వల్ల మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశం ప్రజలకు చాలా తక్కువ ఖర్చుతో వైద్యాన్ని ప్రకృతి చికిత్స అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఇది ఒక జీవిత విధా నంగా మారింది. ఇది ఒక దేశానికో, జాతికో మతానికో పరిమితమైంది కాదు అంతర్జాతీయ చికిత్సా విధానంగా గుర్తింపు పొందింది.

Dr Ramchandra గారు 20 ఏళ్లుగా ప్రకృతి వైద్య సాధనలో ఉన్నారు. నేచురోపతీ వైద్య విధానంలో డాక్టర్ పట్టా పొందారు. ఆయన ప్రఖ్యాత నాసిక్ మెడికల్ కాలేజీలో చదివారు. షుగర్, బీపీ, థైరాయిడ్, పిల్లలలేమి, కేన్సర్, హార్ట్ ప్రాబ్లమ్స్.. వంటి క్రానికల్ వ్యాధులకు సైతం కేవలం ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ద్వారా పూర్తిగా నయం చేసుకోవచ్చని ప్రయోగాత్మకంగా నిరూపించారు. Dr Ramchandra దేశంలోనే ప్రసిద్ధిగాంచిన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మహా బౌద్ధ స్థూపం ఎదురుగా సిద్ధార్థ యోగాలయం నిర్వహిస్తున్నారు. కొన్ని వేల మందిని ఈ ప్రకృతిసిద్ధమైన వైద్య విధానంలో వ్యాధులు లేకుండా హాయిగా జీవించేలా చేశారు. ప్రకృతిలో దొరికే ఆహారంతోనే వ్యాధులను ఎలా తగ్గించుకోవచ్చన్న దానిపై Dr RamChandra ప్రజల్లో అవగాన కల్పిస్తున్నారు. కేవలం ఆహారపు అలవాట్లను మార్చుకోవటంతో పాటు, సహజ సిద్దంగా దొరికే పళ్లు, కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలను ఔషధాలుగా ఉపయోగించుకోవచ్చు. ఏయే వ్యాధులకు ఎలాంటి డైట్ ను ఉపయోగించి తగ్గించుకోవచ్చో Dr RamChandraఇలా తెలియచేస్తున్నారు.

 

You may also like