fbpx
NEWS VIDEOS

ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం.

Please Share with Everyone to Get Awareness 🙏 ప్రతి ఒక్క ఆడపిల్లకి తెలిసే వరకు షేర్ చెయ్యండి . మనుషులలో ఉంటు మనుషుల నుంచే రక్షణ లేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాం. అలాంటి మృగాలను ఏరి వేయాలి. మహిళ ఉద్యోగులకు, మహిళ విద్యార్థులకు, మహిళలకు కొన్ని ముఖ్యమైన విషయాలు. ప్రత్యేకంగా స్కూల్, కాలేజీ విద్యార్థినులు తప్పకుండా పాటించాలి. తమ మంచితనం కొంతమంది వెధవలకి అలుసు అన్న విషయం గుర్తుంచుకోవాలి.

మహిళలకు గమనిక:
మీ మొబైల్‌లో అర్జెంటుగా 112 నెంబర్‌ని సేవ్ చేసుకోండి. అది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే విధంగా ఆ కాంటాక్ట్ హోమ్ స్క్రీన్‌‌లో షార్ట్ కట్ పెట్టుకోండి. కొన్ని మొబైల్స్‌లో Panic Button ఉంటుంది. పోలీస్, ఫైర్, హెల్త్, ఉమెన్ సేఫ్టీ, ఛైల్డ్ ప్రొటెక్షన్‌ వంటి అన్ని సర్వీసులకి సంబంధించిన ఎమర్జెన్సీ నెంబర్ ఇది.

మీ ఫోన్లో Panic Button ప్రెస్ చేయాలంటే.. పవర్ బటన్‌ని మూడుసార్లు వెంటవెంటనే ప్రెస్ చేస్తే చాలు.. అది 112కి కనెక్ట్ అవుతుంది. స్మార్ట్‌ఫోన్ కాకుండా నార్మల్ ఫోన్ వాడే వరు.. తమ కీప్యాడ్ మీద 5 లేదా 9 బటన్లని లాంగ్ ప్రెస్ చేస్తే పానిక్ బటన్ యాక్టివేట్ అవుతుంది. 2018కి ముందు కొన్న ఫోన్లలో ఈ సదుపాయం ఉండదు. అలాంటప్పుడు 112 నెంబర్ సేవ్ చేసుకుని, ప్రమాదంలో ఉన్నప్పుడు దానికి డయల్ చెయ్యాలి. లేదా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 112 India అనే ఈ లింకులోని మొబైల్ యాప్‌ని మీ ఫోన్లో ఇన్‌స్టాల్ చేసి కూడా సహాయం పొందొచ్చు.

https://play.google.com/store/apps/details?id=in.cdac.ners.psa.mobile.android.national

మన ఇంట్లో వాళ్ళకి గూగుల్ మేప్స్ ఎలా షేర్ చెయ్యాలి

మీరు ఉద్యోగానికి వెళ్లేటప్పుడు పబ్లిక్ తిరిగే దారిలోనే వెళ్ళండి ఒంటరిగా కొత్త దారిలో వెళ్ళకండి. MNC కంపెనీలు విధిగా రాత్రి సమయంలో ఉద్యోగినులను ఇంటి గుమ్మం వరకు డ్రాప్ చేయుటకు ఒక సెక్యూరిటీ గార్డ్ తో పాటుగా క్యాబ్ ఏర్పాటు చేయాలి. ఇంట్లోకి వెళ్లే వరకు ఉండి క్యాబ్ వెనుదిరగాలి. ఆ సహాయం తప్పకుండా అడగాలి. లేదా సహోద్యోగి సహకారం తీసుకోవాలి. కాలేజ్ విద్యార్థులు నైట్ లో బర్త్ డే పార్టీ లకు మరియు వివిధ పార్టీలకు మీ స్నేహితులు పిలిచిన వెళ్ళకండి. ఒక వేళ ఖచ్చితంగా వెళ్ళాలి అంటే, వెంట పేరెంట్స్ లో ఒక్కరిని తప్పకుండా తోడు తీసుకెళ్ళండి. స్నేహితులు మంచివారే .. పార్టీలో ఏమైనా జరగొచ్చు. స్నేహంలో పవిత్రత కోల్పోయిన రోజులు ఇవి.

స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలు బండి మీద, కారులలో చేయవద్దు. అతి చనువు భావోద్వేగాలను పెంచుతుంది. అందరితో అతి చనువు, స్నేహం, చొరవ, ఏక వచన ప్రయోగం కూడదు. ఆలస్యం అయినపుడు తప్పకుండా ఇంటికి ఫోన్ చేసి చెప్పండి. మహిళలు ఒక వేళ ఏదైనా పని మీద వెళ్ళి రావడం ఆలస్యం అయి ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తే .. వెంటనే కుటుంబసభ్యులు అందుబాటులో వుంటే వారిని రమ్మని చెప్పండి. ఎవరైనా వచ్చిన తరువాతే బయలుదేరండి. మీరు వెకిల్స్ పార్క్ చేసేటప్పుడు సీసీ కెమెరాలు ఉన్న దగ్గరే పార్క్ చెయ్యండి.

మీకు ఎవరిమిదనైన సందేహం, ప్రమాదకరం అనిపిస్తే వెంటనే 100 ఫోన్ చేసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. వారు మీకు సహాయపడుతారు.  మహిళలు ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు ఒంటి మీద నగలు ఎక్కువగా వేసుకోకండి.  మహిళలు ముఖ్యంగా బయటకు వెళ్ళేటప్పుడు అసభ్యకరంగా ఉన్న బట్టలను వేసుకోకండి. ఫుల్ డ్రెస్ వేసుకోండి. ముఖానికి ఖచ్చితంగా స్క్రాప్ ధరించండి. మీరు దూరంగా కాని, దగ్గరలో కాని షేర్ ఆటోలో ప్రయాణించేటప్పుడు ఆటోలో ప్రజలు వుంటేనే ఆటోలో వెళ్ళండి ఒంటరిగా షేర్ ఆటోలో వెళ్ళకండి. మీ వెంట ఏదైనా స్ప్రే బట్టిల్ తప్పక ఉంచుకోండి.

మీ వెకిల్స్ ఏదైనా ప్రాబ్లం వస్తే బస్ లో వెళ్ళండి. వెహికిల్ అక్కడే వదిలెయ్యండి.  మీరు ఎవరికోసమైనా ఆగవలసి వస్తే పబ్లిక్ ఎక్కువగా వున్న ప్లేస్ లోనే ఉండండి, ఒంటరిగా వుండకండి. ముఖ్యంగా ప్రమాదంగా ఉంది అనిపిస్తే మీరు ఖచ్చితంగా 100కి సమాచారాన్ని అందించండి. వారు మిమ్మల్ని సేఫ్ జోన్ లోకి తీసుకువెళ్తారు. ముఖ్యంగా ధైర్యంగా ఎదిరించే ప్రయత్నం చేయాలి. సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలి. అవతల వాడి సున్నితమైన ప్రాంతాలలో దాడి చేయాలి. గట్టిగా అరిచి అందర్నీ అలెర్ట్ చేయాలి. రహస్యంగా అసభ్య వ్యాఖ్యలు, చేష్టలు చేసినపుడు పక్కన ఉన్నవారికి చెప్పి అక్కడికక్కడే శిక్షించాలి.

ఇవన్నీ కాకుండా చట్టాలు కూడా … నిందితులను నిర్దాక్షిణ్యంగా బహిరంగంగా కాల్చి చంపాలి. ప్రతి శిక్షకు భయంకరమైన శిక్షలు ఉండాలి. అపుడు ఇంకోడు ధైర్యం చేయడు. ఈ విషయంలో HRC అభ్యంతరాలు చెప్పి వారిని కాపాడే ప్రయత్నాలు మానుకోవాలి. వారు ఉన్నది మానవ హక్కుల పరిరక్షణ కొరకు అని గుర్తుంచుకోవాలి. ఇలాంటి అమానవీయ చర్యలు చేసిన రాక్షసులను బహిరంగంగా శిక్షించే ప్రయత్నాలకు సహకరించాలి.

మంచి జీవితం అతి దారుణంగా ముగిసిపోయింది. ఆమె ఆత్మ శాంతికి ప్రార్థిస్తూ … ఆ దుర్మార్గుల భయానక చావు కాంక్షిస్తూ … 🙏😪😷😥నా ఇంట్లో నా సొంత చెల్లెలు కోల్పోయిన దుఃఖం కలుగుతోంది 😫ప్రజా రక్షణలో నిమగ్నమైన అధికారులు ఈ మధ్య పెరిగిన అత్యాచారాలు, హత్యలు మానభంగాలు దృష్టిలో ఉంచుకొని నిందితులను కఠినంగా శిక్షించే ప్రయత్నం చేయాలని మనసారా కోరుతున్నాను. మహిళలకు ప్రతిక్షణం రక్షణ కల్పించే దిశగా అధికారులు చేసే ప్రయత్నాలు అభినందనీయం. అవి మహిళలకు చేరే విధంగా వారికి అవగాహన కల్పించే ప్రయత్నం ప్రతి కార్యాలయంలోనూ సదస్సులు నిర్వహించాలని విజ్ఞప్తి.

Please add these numbers: She team phone no.040-27852355 Whatsapp 9490616555 📲📲 Please share to all women to get assistance from Police in any emergency 📣🛎🚨

హైదరాబాద్ నగర శివార్లలో జరిగిన యువ పశువైద్యురాలు ప్రియాంక హత్యోదంతం అత్యంత దారుణం / బాధాకరం. అయితే హైదరాబాద్ నగరాన్ని అనుకొని, నిత్యం జనాలు / వాహనాలు తిరిగే జాతీయ రహదారి / ఔటర్ రింగ్ రోడ్ సమీమంలో జరిగిన ఈ దారుణ సంఘటన నగర జీవితంలో ఉన్న భద్రతా లోపాల్ని/ డొల్లతనాన్ని మరొక్కసారి ఎత్తిచూపి, ఎన్నెన్నో ప్రశ్నలు లేవనెత్తుతుంది.

ఉన్నత విద్యావంతురాలు ఐన యువతి రాత్రి 9 గంటలకు తన ద్విచక్ర వాహనంతో ప్రయాణిస్తున్న సమయంలో టైరు పంక్చర్ లాంటి అనుకోని అవాంతరం ఎదురైనప్పుడు, దాన్ని ఎదుర్కోవడంలో సమయస్ఫూర్తి సంగతి ప్రక్కన పెడితే, కనీస కామన్ సెన్స్ కూడా ఉపయోగించలేనంత భయపడిందా?? జనసంచారం ఎక్కువగా ఉండే టోల్ గేట్ లాంటి చోట్ల వేచిఉండకుండా, అపరిచిత వ్యక్తులను నమ్మి, వారి సాయం తీసుకొని ప్రమాదంలోకి వెళ్లిపోయిందా? తన ఫోన్, దానిలోని అనేక కమ్యూనికేషన్ apps / సదుపాయాలు లాంటివి వాడి, దగ్గరలోని కుటుంబసభ్యులు / స్నేహితులు / బంధువులు / పరిచయస్తులు మొదలైన వారి సాయం ఎందుకు కోరలేకపోయింది?? లేదా కనీసం ప్రభుత్వ ఎమర్జెన్సీ రెస్పాన్స్ నంబర్స్ అయినా 100 / 1090 / 1091 లాంటి నంబర్స్ కి అన్నా కాల్ చేయాలనే ఆలోచన / అవకాశం రాలేదా?? ఒకవేళ చేసినా ఎవ్వరూ తక్షణమే తగినరీతిలో స్పందించలేదా?? అలాగే ప్రభుత్వం / పోలీస్ యొక్క పెట్రోలింగ్ / సీసీ టీవీ కెమెరాల మానిటరింగ్ కు కూడా ఈ దారుణంని అరికట్టలేకపోవటం అత్యంత దురదృష్టకరం!!

కనీసం ఈ సంఘటన నుండైనా ఇలాంటి అనుకోని అవాంతరాలు / ఇబ్బందులు / ప్రమాదాలు ఎదురైనప్పుడు ఎలా స్పందిస్తే, క్షేమంగా బయటపడతాం అనే విషయంలో అంతా, మరీ ముఖ్యంగా మహిళలు పూర్తి అవగాహన పెంచుకొని, తగిన జాగర్తలు తీసుకోవాలి. కీడెంచి మేలు ఎంచాలి అనే సామెతను గుర్తు ఉంచుకొని ప్రతి నిమిషం అప్రమత్తతతో, సమయస్ఫూర్తితో, కనీస కామన్ సెన్స్ తో ఉంటూ దైర్యంగా ఎదుర్కోవాలి!!

సర్వేజనా సుఖియోభావంతు!! నోట్ : నా లిస్ట్ లో ఉన్న మహిళామణులు ( కుటుంబసభ్యులు / అక్క చెల్లెళ్లు / స్నేహితురాళ్ళు / బంధువులు / పరిచయస్తులు ) అందరి భద్రత / క్షేమం కోరుతూ వారికే ఈ పోస్ట్ అంకితం!!

ఎక్కడ స్త్రీ పూజించబడుతుందో అక్కడ దేవతలు ఉంటారు అంటారు.. పూజించే మాట దేవుడు ఎరుగు కనీసం స్వేచ్ఛగా బ్రతకనిస్తే చాలు అన్నట్లు తయారయింది సొసైటీ సంఘటనల్లో మనుషులే మారుతున్నారు జరిగేవి రోజు జరుగుతూనే ఉన్నాయి అమ్మాయి పుట్టకలో అణచివేత,పుట్టి పేరిగేక అణచివేత.