fbpx
Celebrities Entertainment TOLLYWOOD

బిగ్‌బాస్‌-3 గెలిచినా రాహుల్ గురించి ఈ ఆసక్తికరమైన విషయాలు తెలుసా ..?

బిగ్ బాస్ 3 గ్రాండ్ ఫినాలేలో రాహుల్ తల్లిదండ్రులు, సోదరి పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రాహుల్ టైటిల్‌ను అందుకున్నప్పుడు ఆయన తల్లిదండ్రులు పక్కనే ఉన్నారు. ఆ తరవాత వారు నేరుగా మెహదీపట్నంలోని ఇంటికి వెళ్లిపోయారట. అక్కడ రాహుల్‌కు ఘనంగా స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేశారట. పువ్వులు, కేకులు, స్వీట్లు సిద్ధం చేశారట. కానీ, రాహుల్ మాత్రం అన్నపూర్ణ స్టూడియో నుంచి బయటికి వచ్చిన తరవాత ర్యాలీగా మెహదీపట్నంలోని ఆయన మావయ్య ఇంటికి వెళ్లిపోయారని సమాచారం. అయితే వృత్తిరీత్యా బార్బర్‌ అయిన రాహుల్‌ సిప్లిగంజ్‌ ప్రాథమికమైన రెండు కోరికలతో బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెట్టాడు. ఒకటి: మంచి సొంత సెలూన్‌ తెరవడం. రెండు: ఒక సొంత ఇల్లు సంపాదించుకోవడం. బిగ్‌బాస్‌ విజేతగా ఈ రెండు కోరికలు తీర్చుకోవడం అతనికి ఇక కష్టం కాకపోవచ్చు. రాహుల్‌ది హైదరాబాద్‌ ధూల్‌పేటలోని మంగళ్‌హాట్‌.

అతని కుటుంబం ప్రస్తుతం విజయ నగర్‌ కాలనీలోని ఒక అద్దె ఇంటిలో ఉంటోంది. రాహుల్‌ ఫోక్‌ సింగర్‌గా, సినిమా గాయకునిగా మారకముందు తండ్రితో కలిసి నాంపల్లిలోని శ్రీ సాయి కిరణ్‌ సెలూన్‌లో పని చేసేవాడు. వచ్చిన కస్టమర్లను తన మాటలతో పాటలతో అలరించేవాడు. విజయనగర్‌ కాలనీలో కూడా చుట్టుపక్కల వారికి అతడు ఆత్మీయుడు. ‘రాహుల్‌ మమ్మల్ని చాలా ప్రేమగా పలకరిస్తాడు’ అని అనిల్‌ సింగ్‌ అనే అతని స్నేహితుడు తెలిపాడు. ‘దీపావళి వస్తే చాలా సందడి చేస్తాడు. ఈసారి పండగ సమయానికి అతడు హౌస్‌లో ఉండటంతో మేమంతా కొంచెం నిరాశ పడ్డాం’ అని మరో స్నేహితుడు శ్రీవత్స చెప్పాడు. హౌస్‌లో ఉన్న రోజుల్లో తోటి కంటెస్టెంట్‌ శ్రీముఖితో తనకి సఖ్యత కుదరలేదు. అదే శ్రీముఖిని రాహుల్‌ ఫైనల్స్‌లో ఓడించడం అభిమానులకే కాదు, ఎక్కువమందికి నచ్చినట్టు కనపడుతోంది.

రాహుల్‌ తన నేపథ్యాన్ని, వృత్తిని దాచకుండా గౌరవంతో సొంతం చేసుకోవడం చాలా మందికి నచ్చి ఉండవచ్చు. నాంపల్లిలోని సాయికిరణ్‌ హెయిర్‌ సెలూన్‌లో తండ్రి రాజ్‌కుమార్‌తో బార్బర్‌గా పని చేసిన రాహుల్‌ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి, దర్శకుడు రాజమౌళి వంటి వారికి హెయిర్‌ కట్‌ చేసేవాడని అతని స్నేహితులు చెబుతున్నారు. ఇప్పుడు తమ స్నేహితుడే సెలబ్రిటీగా మారడంతో ఇంటి దగ్గర కోలాహాలం ఏర్పడింది. షో ముగిశాక నిబంధనల ప్రకారం ఇంకా జనంలోకి రాని రాహుల్‌ త్వరలో ఇల్లు చేరి తమతో దావత్‌ చేసుకుంటాడని మిత్రులు ఎదురు చూస్తున్నారు.

రాహుల్ గెలుపు వెనుక ఆ ఇద్దరు ఆడవాళ్ళు.. నిజంగా నమ్మలేరు

Add Comment

Click here to post a comment

Your email address will not be published. Required fields are marked *