fbpx
NEWS Technology

GOOGLE PAY లో అప్ ద్వారా డబ్బులు పంపుతున్నారా …! అయితే ఈ విషయం మీకోసమే ….!

వాస్తవానికి నోట్ల రద్దు ముందు వరకు మొబైల్ డిజిటల్ పేమెంట్స్ యాప్స్ గురించి చాలా మందికి తెలియదు. ఒకవేళ తెలిసినా వాటిని అంతగా ఉపయోగించుకునేవారు కాదు. కరెన్సీ కష్టాలు మొదలైన మరుక్షణం నుంచి ప్రతి ఒక్కరూ డిజిటల్ పేమెంట్స్ వైపు అడుగులు వేయవల్సి వచ్చింది. దీంతో ఈ విధమైన పేమెంట్ సర్వీసులకు ఊహించని రీతిలో ఆదరణ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ తన సరికొత్త మొబైల్ పేమెంట్ సర్వీస్ తేజ్ (Tez)ను ఇటీవల భారత్‌లో లాంచ్ చేసింది. ఈ UPI ఆధారిత పేమెంట్స్ అప్లికేషన్‌లో అనేక ఆసక్తికర ఫీచర్లు ఉన్నాయి. మీరు ఇప్పటి వరకు Google Tez యాప్‌ను ట్రై చేయినట్లయితే, ఈ కధనం ద్వారా యాప్ వినియోగం గురించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

ఇక నుంచి గూగుల్ పే ప్లాట్ ఫాంపై నిర్వహించే పేమెంట్స్ ఎంతో సేఫ్‌. గూగుల్ పేలో కొత్త ఫీచర్ వచ్చింది. ఈ ఫీచర్ ద్వారా ప్రతి UPI బేసిడ్ పేమెంట్స్ సమయంలో యూజర్‌కు గూగుల్ పే యాప్ ద్వారా ఓ కలెక్షన్ రిక్వెస్ట్ SMS నోటిఫికేషన్ పంపిస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా గూగుల్ పేతో లింక్ అయిన బ్యాంకు అకౌంట్ నుంచి ట్రాన్స్ జెక్షన్ ఎలా జరుగుతుందో ముందే తెలిసిపోతుంది. ఏదైనా అనుమానాస్పద ట్రాన్స్ జెక్షన్ మీ ప్రమేయం లేకుండా జరిగినా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ప్రతి UPI ట్రాన్స్ జెక్షన్ పూర్తి కావాలన్నా కచ్చితంగా SMS నోటిఫికేషన్ ధ్రువీకరించాల్సి ఉంటుంది. యూజర్ ఆ నోటిఫికేషన్ కన్ఫామ్ చేస్తేనే ట్రాన్స్ జెక్షన్ పూర్తి అవుతుంది. యూజర్లు తమ డబ్బును భద్రంగా ఉంచుకునేందుకు ఈ లేటెస్ట్ ఫీచర్ ఎంతో హెల్ప్ అవుతుందని గూగుల్ తెలిపింది.

ఎలాంటి అనుమానాస్పద ట్రాన్స్ జెక్షన్ జరిగినా వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో అలర్ట్ వస్తుందని ప్రొడక్ట్ మేనేజ్ మెంట్, డైరెక్టర్ అంబరీష్ కెంగే తెలిపినట్టు గూగుల్ పే తన బ్లాగ్ పోస్టులో పేర్కొంది. యూజర్ తమ కాంటాక్ట్ లిస్టులో లేని మొబైల్ నెంబర్ నుంచి ట్రాన్స్ జెక్షన్ రిక్వెస్ట్ వస్తే వెంటనే పసిగట్టవచ్చునని తెలిపింది. ఇలాంటి మోసపూరిత లావాదేవీలను గుర్తించేందుకు వీలుగా గూగుల్ పే ప్లాట్ ఫాంపై మిషన్ లెర్నింగ్ బేసిడ్ స్కాం ప్రివెన్షన్ మోడల్స్ వినియోగిస్తున్నట్టు పేర్కొంది. కలెక్షన్ రిక్వెస్ట్ నోటిఫికేషన్ అనే ఈ యూనిక్ ఫీచర్ UPI ప్లాట్ ఫాంలో ఉండటంతో కొత్తగా గూగుల్ పే వాడే యూజర్లు కాస్త గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. అందుకే గూగుల్ పే.. ప్రతి సింగిల్ మూమెంట్ కు సంబంధించి యూజర్ కు ఎప్పటికప్పుడూ మెసేజ్ తో కూడిన సమాచారాన్ని తెలియజేస్తుంటుంది.