fbpx
VIDEOS

కోళ్ళలో కూడా మంత్రి హ‌రీష్‌రావుకు క్రేజ్… (వీడియో)

ఎంత ఎదిగినా ఒదిగి ఉండే నేతల్లో తెలంగాణ మంత్రి హరీష్ రావు ముందువరుసలో ఉంటారు. అందుకేనేమో తెలంగాణ ప్రజలకు అందులోనూ సిద్ధిపేట ప్రజలకు హరీష్ రావు అంటే అంత ప్రేమ ఉంటుంది. కేవలం మంత్రి అనే ధీమా కూడా లేకుండా తన ప్రజలకు ఎల్లప్పుడు సేవలు చేస్తూనే ఉంటారు. టీఆర్ఎస్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి తన మామ కేసీఆర్ వెనుకే నడుస్తూ…తెలంగాణ ఉద్యమంలో హరీష్ ప్రధాన పాత్ర పోషించారు. ఉద్యమ నేతగా, రాజకీయ నాయకుడుగా, మంత్రిగా మంచి పేరు తెచ్చుకున్న హరీష్ కు సిద్ధిపేట ప్రజలు ఎప్పుడు బ్రహ్మరథం పడుతూనే ఉంటారు.

 

2004 నుంచి హరీష్ సిద్ధిపేటలో తన జైత్రయాత్ర కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక 2018 ఎన్నికల్లో కూడా హరీష్ లక్ష ఓట్ల పైనే రికార్డు మెజారిటీతో విజయం సాధించరంటేనే అర్ధం చేసుకోవచ్చు..సిద్ధిపేట ప్రజలకు హరీష్ అంటే ఎంత అభిమానమో. అయితే హరీష్ అంటే కేవలం ప్రజలకే మాత్రమే కాదు…కోళ్ళకు కూడా అభిమానం ఉందని ఓ వీడియో చూస్తే అర్ధమైంది.

ఓ మీడియా చానల్ సిద్ధిపేటకు వెళ్ళి మరి హరీష్ పై కోళ్ళకు ఉన్న అభిమానాన్ని చూపించింది. సిద్ధిపేటలోని ఓ గ్రామంలోని ఓ హరీష్ అభిమానికి నాటు కోళ్ళు పెంచే అలవాటు ఉంది. అయితే అతను పిలిస్తే కోళ్ళు చుట్టూ వచేస్తాయి. కాకపోతే అతని హరీష్ వచ్చాడు రావాలని వాటిని ముద్దుగా పిలుస్తాడు. దీంతో అక్కడ కోళ్ళు అన్ని పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాయి. అస్సలు హరీష్ పేరు వినడమే ఆ కోళ్ళు దూకుడుగా వస్తున్నాయి. ఇక దీని బట్టే అర్ధం చేసుకోవచ్చు హరీష్ అంటే సిద్ధిపేట ప్రజలకే కాదు….కోళ్ళకు అభిమానం ఎక్కువని.

వీడియో చుడండి :