fbpx
NEWS

ఇస్మార్ట్ శంకర్ భారీ క్రేజ్.. పూరీ, రామ్ ఏం చేస్తారో..!

ఎన్నో అంచనాల నడుమ విడుదలై మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది ‘ఇస్మార్ట్ శంకర్’. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ – ఎనర్జిటిక్ స్టార్ రామ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాను మాస్ ప్రేక్షకులు బాగానే ఆదరించారు. అయితే, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను రాబట్టడంలో ఈ సినిమా కొంత సక్సెస్ కాలేదన్న టాక్ వినిపిస్తోంది. అయితే, ఇందులో రామ్ నటన, లుక్, బాడీ లాంగ్వేజ్, తెలంగాణ యాస డైలాగ్స్ అన్నీ బాగున్నాయని సినిమా చూసిన వారు చెబుతున్నారు. అదే సమయంలో టేకింగ్ విషయంలో పూరీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.రామ్ – పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. అయితే, సినిమా వచ్చి 24 గంటలు గడువక ముందే ఇది ఆన్‌లైన్‌లో లీక్ అయింది. తమిళ రాకర్స్ దీన్ని పైరసీ చేసి ఆన్‌లైన్‌లో ఉంచేసింది.

వీకెండ్‌లో మంచి కలెక్షన్లు రాబట్టాలని ప్లాన్ చేసిన చిత్ర యూనిట్‌కు షాకిచ్చింది.సినీ ఇండస్ట్రీకి ‘తమిళ రాకర్స్’ వరుస షాక్‌లు ఇస్తూనే ఉంది. సినిమా విడుదల అవడం.. 24 గంటలు గడువక ముందే పైరసీ చేసి ఆన్‌లైన్ పెట్టేయడం వంటివి చేస్తూ ఫిల్మ్ మేకర్స్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది ఈ ఆన్‌లైన్ వెబ్‌సైట్. దీనిపై ఎన్ని సార్లు నిషేదం విధించినా.. సరికొత్త అడ్రెస్‌లు సృష్టించి నెటిజన్లకు దగ్గరవుతోంది. ఈ క్రమంలోనే అన్ని భాషలకు చెందిన ఎన్నో సినిమాలను పైరసీ చేసి పెట్టేస్తున్నారు.కోట్లు ఖర్చుపెట్టి, వందలాది మంది కష్టంతో సినిమా తీస్తే, రిలీజ్ కాకుండానో.. ప్రేక్షకుల ముందుకు వచ్చిన కొన్ని గంటల్లోనే పైరసీ కోరల్లో చిక్కుకుంటోంది. థియేటర్లలో కంటే ముందే ఇంటర్నెట్‌లో ప్రింట్‌ వచ్చేస్తోంది. ఇలా పైరసీ చేసే వాటిలో త‌మిళ రాకర్స్ ఒకటి. దీని అడ్మిన్ అయిన జాన్‌, కార్తీక్‌, ప్ర‌భుల‌ని గత సంవత్సరం పోలీసులు అరెస్ట్ చేశారు. అయినప్పటికీ ఈ సైట్ రన్ అవుతుండడం గమనార్హం.ఇస్మార్ట్ శంకర్’ విడుదలైన తొలి రోజే మంచి కలెక్షన్లను సాధించి దూసుకుపోతోంది. ఈ సినిమా టాక్ ఎలా ఉన్నా.. కలెక్షన్లు మాత్రం బాగానే వస్తున్నాయి. తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా మొత్తంగా 16 కోట్ల షేర్ వసూలు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 7.8 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. ఈ మేరకు కలెక్షన్ రిపోర్ట్ తెలుపుతూ సోషల్ మీడియా ద్వారా ఆనందం వ్యక్తం చేసింది చిత్రయూనిట్.చిత్ర ఫలితం పట్ల ‘ఇస్మార్ట్ శంకర్’ యూనిట్ సంతృప్తిగానే ఉంది. ఈ మేరకు సోషల్ మీడియాలో తమ అభిమానులతో హీరో, దర్శకుడు, నిర్మాత ఛార్మీ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు.

సినిమా విడుదల రోజు రామ్ పోస్టర్‌కు బీర్‌తో అభిషేకం చేస్తే ఛార్మీ క్రేజీ అంది. అలాగే రామ్ కూడా పూరీపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలో చిత్ర పైరసీపై వీళ్లు స్పందిస్తారా? లేదా? చూడాలి.విజయం కోసం పరితపిస్తున్న పూరీ జగన్నాథ్ – ఎనర్జిటిక్ స్టార్ రామ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. పూరి సొంత బ్యానర్ టూరింగ్ టాకీస్, సీనియర్ హీరోయిన్ ఛార్మీ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో రామ్ సరసన నిధీ అగర్వాల్, నభా నటేశ్‌ నటించారు. అలాగే, ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూర్చారు.