fbpx
NEWS Technology

జియో నుండి కొత్త ఫోన్.. ఫీచర్స్ చూస్తే మతిపోతుంది

డేటా సంచలనం రిలయన్స్ జియో మరో సరికొత్త ఫీచర్ ఫోన్ ప్రవేశపెట్టబోతోంది. ఆగస్టు 12న నిర్వహించబోయే కంపెనీ 42వ వార్షిక ప్రధాన సమావేశంలో జియో గిగాఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసును అధికారికంగా లాంచ్ చేయనుంది. గిగాఫైబర్ సర్వీసుతో పాటు Jio Phone 3 ఫీచర్ ఫోన్‌ను కూడా రిలీజ్ చేయనున్నట్టు ఓ రిపోర్టు తెలిపింది.ఇదివరకే జియోఫోన్ 2 ఫోన్ రిలీజ్ చేసి సక్సస్ సాధించిన జియో.. మరో కొత్త ఫీచర్ ఫోన్‌తో టెలికం సెక్టార్‌ను షేక్ చేయనుంది. ఆసక్తికరమైన విషయమం ఏమిటంటే.. జియో ఫోన్ 2 కంటే.. రాబోయే జియోఫోన్ 3 అత్యంత శక్తివంతంగా ఉంటుందని అంచనా.

ఈ కొత్త ఫోన్ Media Tek ప్రాసెసర్‌తో Jio Phone 2కు అప్ గ్రేడ్ వెర్షన్‌‌గా ప్రత్యేక ఆకర్షణతో నిలువనుంది. 2019 ఏడాదిలో రిలయన్స్ జియో కొత్త ఫీచర్ ఫోన్ లాంచ్ చేస్తుందా? లేదా అనేదానిపై ఇప్పటివరకూ కచ్చితమైన రిపోర్టులు లేవు.ఓ రిపోర్టు ప్రకారం.. టెలికం దిగ్గజం రిలయన్స్ 4G ఫీచర్ ఫోన్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపింది. Jio Phone 3 పేరుతో ఓ ఫీచర్ ఫోన్‌పై టెస్టింగ్ కూడా కొనసాగుతున్నట్టు పేర్కొంది. రిలయన్స్ జియో మాత్రం దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రివీల్ చేయలేదు. Jio Phone 3కు సంబంధించి కొన్ని హార్డ్ వేర్ వివరాలు లీక్ అయ్యాయి.Jio Phone 3 ఫీచర్ ఫోన్‌లో Media Tek Chipset అని పేరు పెట్టినట్టు తెలిపింది. ఫీచర్ ఫోన్ల కోసం ప్రత్యేకమైన చిప్‌ను Chipmaker ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

2017 కంపెనీ AGM మీటింగ్‌లో రిలయన్స్ జియో ఫస్ట్ ఫీచర్ ఫోన్ ఎకా జియోఫోన్ ప్రవేశపెట్టింది. ఇండియాలో ఆ తర్వాత 2018 ఆగస్టులో జియో ఫోన్ 2 ఫీచర్ ఫోన్ ప్రవేశపెట్టింది. బేసిక్ జియోఫోన్ కు జియో ఫోన్ 2 అప్ గ్రేడ్ తో మార్కెట్లోకి రిలీజ్ అయింది.