fbpx
NEWS

హమ్మయ్య , ఇక నుంచి తెలుగులో మందుల పేర్లు, ప్రభుత్వం కీలక ఆదేశాలు.

రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రోజులుగా ప్రభుత్వ ఆస్పత్రులకు సరఫరా చేసే మందుల పేర్ల ముద్రణలో మార్పులు చేసింది. గతంలో ఆంగ్లంలోనే పేర్లు ఉండడంతో పెద్దగా చదువుకోలేని పల్లె వాసులకు పూర్తిగా అవగాహన ఉండేది కాదు. ఫార్మసిస్టులు చెప్పినా ఇంటికి వెళ్లాక వాడడంతో అయోమయంలో నెలకొనేది. ఆకుపచ్చ రంగు మాత్రలు ఉదయం.. తెలుపు రంగు మాత్రలు ఉదయం, రాత్రి వేసుకోవాలని నిరక్షరాస్యులకు అర్థమయ్యేలా సిబ్బంది చెప్పేవారు. ప్రస్తుతం ఆంగ్లంతో పాటు తెలుగులోనూ పేర్లు ముద్రిస్తుండడంతో కనీస అక్షర జ్ఞానం ఉన్న వారు సైతం సులువుగా గుర్తుపట్టే అవకాశం ఉంది.

ఇదివరకు మాదిరిగా మాత్రలు మందులపై పేర్లు చదవడానికి రాక ఒకదానికి బదులుగా మరొకటి వేసుకునేపరిస్థితి ఇక ఉండబోదని ఫార్మసిస్టులు, వైద్యులు చెబుతున్నారు. అయితే మందు డబ్బాలపై పేర్లు ఇంగ్లీష్ లో ఉంటాయి. దీంతో ఎక్కువగా చదువుకొని వాళ్లకు ఇంగ్లీష్ రాని వాళ్లకు ఆ పేర్లను అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. దీంతో చదువుకున్న వాళ్ళ సహాయం పొందుతుంటారు. కానీ, అలా ఎన్ని రోజులు చేస్తారు. ఇబ్బంది ఎప్పటికైనా ఇబ్బందే. దానికి సరైన పరిష్కారం చూపాల్సిందే.

ఈ నేపథ్యంలో సామాన్యులకు మందులపై అవగాహన పెంచేందుకై తెలంగాణ వైద్యారోగ్యశాఖ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు బస్తీ దవాఖానల్లో రోగులకు ఇచ్చే మందులపై తెలుగులో కూడా ముద్రించి అందజేయడం మొదలుపెట్టింది.

సామాన్యులకు కూడా మందుల పేర్లు తెలిసేలా చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వైద్యాధికారులు తెలిపారు. మలక్‌పేట క్లస్టర్‌ పరిధిలోని బీ-బ్లాక్‌, శాలివాహననగర్‌, గడ్డిఅన్నారం, మాదన్నపేట, జాంబాంగ్‌లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇలాగే మందులను సరఫరా చేస్తున్నారు. అంతేకాకుండా ఈ మందులు బ్లాక్‌ మార్కెట్‌కు వెళ్లకుండా చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.