fbpx
NEWS

పాకిస్ధాన్ దేశానికి ప్ర‌ధాన ఆదాయం అందిస్తొన్న శ్రీరాముని కుమారులు నిర్మించిన 4 న‌గ‌రాలు..!!

మ‌న దాయాది దేశ‌మైన పాకిస్ధాన్ ఒక‌ప్పుడు అఖండ భారతావనిలొ అంత‌ర్భాగంగా ఉండేది. హిందూ ధ‌ర్మం ప‌రిడ‌విల్లిన రొజుల్లొ ప్ర‌స్తుత పాకిస్ధాన్, కిజికిస్తాన్, ఉక్రెయిన్,ఇరాన్ ఇరాక్ రాజ్యాలు హిందూ సంస్క్రుతిలొ కీల‌క భూమిక పొషించాయి. నాటి అవ‌స‌రాల‌కొసం మ‌న రాజులు నిర్మించిన ప‌ట్ట‌ణాలు ప్రస్తుతం మ‌హా నగ‌రాలుగా విల‌సిల్లుతున్నాయి. వాటిలో కీల‌క‌మైన సాక్షాత్తూ శ్రీరామ చంద్రుని కుమారులు నిర్మించిన 4 న‌గ‌రాలు ప్ర‌స్తుతం పాకిస్ధాన్ దేశ ప్ర‌గ‌తిలొ కీల‌క భూమిక పొషిస్తున్నాయి.

పాకిస్థాన్ లోని ప్ర‌ధాన న‌గ‌రాలైన వాటిలో నాలుగు న‌గ‌రాల‌ను శ్రీరాముని త‌న‌యులైన ల‌వ‌,కుశ‌లు….భ‌ర‌తుని కుమారులైన త‌క్షుడు, పుష్క‌రుడు క‌ట్టించారు. అప్ప‌ట్లో ఈ న‌గరాలు పేర్లు కూడా క‌ట్టించిన వారి పేరు మీదుగానే ఉండేవి, కాల‌క్ర‌మేణా….వాటి పేర్ల‌లో మార్పులు సంభ‌వించాయి, మార్పులొచ్చిన‌ప్ప‌టికీ వాటి పేర్లు ఒరిజిన‌ల్ పేర్లకు ద‌గ్గ‌ర‌గా ఉండడం విశేషం.

ఆ న‌గ‌రాలేంటో ఇప్పుడు చూద్దాం.

1. ఖాసూర్
దీని అస‌లు పేరు కుశపురం….దీనిని శ్రీరాముడి పెద్ద‌ కుమారుడు కుశుడు క‌ట్టిచాడు, అత‌ని పేరు మీదుగానే ఈ న‌గ‌రానికి కుశపురం వ‌చ్చింది, త‌ర్వాత‌ర్వాత‌….కుశపురం కాస్త‌…ఖాసూర్ గా రూపాంత‌రం చెందింది. 2. లాహోర్ దీని అస‌లు పేరు ల‌వ‌పురం….దీనిని శ్రీరాముడి చిన్న కుమారుడు ల‌వుడు క‌ట్టిచాడు, అత‌ని పేరు మీదుగానే ఈ న‌గ‌రానికి ల‌వ‌పురం వ‌చ్చింది, త‌ర్వాత‌ర్వాత‌….ల‌వ‌పురం కాస్త‌…లాహోర్ గా రూపాంత‌రం చెందింది.

౩. తక్షశిల దీనిని శ్రీరాముని తమ్ముడైన భరతుని పెద్దకొడుకు తక్షుడు నిర్మించాడు. 4. పెషావర్ దీని అస‌లు పేరు పుష్కలావతి / పురుషపురం…దీనిని శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ కొడుకు పుష్కరుడు నిర్మించాడు. కాల‌క్ర‌మేణా పురుష‌పురం కాస్త పెషావ‌ర్ గా మారిపోయింది. ప్ర‌స్తుతం ఈ నాలుగు న‌గ‌రాలు పాకిస్తాన్ ప్ర‌గ‌తిలొ కీల‌క‌మైపొయాయి. దేశ ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రు ఈ నాలుగు న‌గ‌రాల‌నుండే అందడం గ‌మ‌నార్హం.