fbpx
Celebrities Entertainment Movies REVIEWS TOLLYWOOD

Saaho Movie Review : ‘సాహో’ దుబాయ్ రివ్యూ వ‌చ్చేసింది…

యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ సాహో ఫీవ‌ర్‌తో ఇండియ‌న్ సినిమా ల‌వ‌ర్స్ ఊగిపోతున్నారు. రూ.350 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా రెండేళ్లకు పైగా నిర్మాణం జ‌రుపుకుంది. ఇక ఈ సినిమా కోస‌మే ద‌ర్శ‌కుడు సుజీత్ ఏకంగా ఆరు సంవ‌త్స‌రాల పాటు సుదీర్ఘంగా నిరీక్షించారు. ఈ నెల 30న ప్ర‌పంచ‌వ్యాప్తంగా నాలుగు భాష‌ల్లో భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది.

బాహుబ‌లి సీరిస్‌లో వ‌చ్చిన రెండు బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాల త‌ర్వాత వ‌స్తోన్న సినిమా కావ‌డంతో ఇప్పుడు ప్ర‌భాస్ సాహోకు క‌నివినీ ఎరుగ‌ని క్రేజ్ నెల‌కొంది. ఇప్పటికే ఆన్ లైన్ బుకింగ్ టికెట్లు హాట్ కేక్స్ కంటే వేగంగా అమ్ముడవుతుండగా ప్రతి స్క్రీన్ లోనూ నిముషాల్లోనే హౌస్ ఫుల్ బోర్డులు పడుతున్నాయి. ఇంక చెప్పాలంటే బాలీవుడ్ స్టార్స్ సినిమాల‌ను త‌ల‌ద‌న్నేలా బుక్ మై హౌస్‌లో టిక్కెట్లు అమ్ముడ‌వుతున్నాయి.

ఇక దుబాయ్‌లో ఒక రోజు ముందుగానే సాహో షోలు ప‌డ‌నున్నాయి. ఇప్ప‌టికే అక్క‌డ సెన్సార్ కంప్లీట్ కూడా అయ్యింది. ఈ నేప‌థ్యంలో ఇండియ‌న్ సినిమాల‌కు దుబాయ్ నుంచి ముందుగానే రివ్యూలు ఇచ్చే దుబాయ్ సెన్సార్ బోర్డు మెంబ‌ర్, ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ ఉమైర్ సంధు పెట్టిన ట్వీట్స్ చూస్తుంటే సాహో బ్లాక్‌బ‌స్ట‌రే అని తేలిపోతోంది.

సాహో సినిమాపై మొత్తం మూడు ట్వీట్లు పెట్టిన ఉమైర్ సాహో మొదటి సగం మీ మతులు పోగొడుతుంది… ఛేజులు యాక్షన్ సీక్వెన్సులకు గూస్ బంప్స్ ఖాయం. టికెట్ డబ్బులు ప్రభాస్ ఎంట్రీతోనే గిట్టుబాటు అయిపోతాయ‌ని పేర్కొన్నాడు. ఇక రెండో ట్వీట్లో విల‌న్ షేడ్స్ ఉన్న రోల్‌లో ప్ర‌భాస్‌ను చూడ‌డం మాస్టర్ స్ట్రోక్. ఇంకే నటుడిని ఇంత కూల్ గా దొంగతనాలు చేసే పాత్రలో ఊహించుకోలేం అని చెప్పాడు.

మూడో ట్వీట్లో ఓవ‌రాల్‌గా సాహో గొప్ప సాలిడ్ యాక్షన్ ఎంటర్ టైనర్. ప్రభాస్ ఇరగదీశాడు. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ తక్కువ స్థాయిని సాహో అందుకునే ఛాన్స్ లేద‌ని చెప్పాడు. ఏదేమైనా ఉమైర్ ట్వీట్ల‌తో జ‌ర‌గ‌బోయే ర‌చ్చ ఏ రేంజులో ఉంటుందో చెప్ప‌క‌నే చెప్పేశాడు.