కాలం కలిసిరావాలిగాని ఏదైనా సాధ్యమే. ఇదిగొ ఇ మాటే ఆక్షరాల రుజువయ్యింది అతని విషయంలొ. ధనలక్ష్మి అతని ఇంటి తలుపుతట్టడంతో అనుకోని రీతిలొ రాత్రికి రాత్రే కొటీశ్వరుడయ్యాడు ఆ దినసరి కూలీ ఇంతకీ ఎవరా కూలీ ఏంటా స్టొరీ వివరాలు తెలుసుకుందాం.
రొజంతా కష్టపడినా చాలీ చాలని కూలీ డబ్బుతో సరుకులు కొని ఇంటికివెళ్తూ ఓ లాటరీ షాపు ముందు ఆగాడు మనొజ్ కుమార్. మనిషి ఆశాజీవి కావడంతొ టిక్కెట్ కొంటే కొట్లు తనదవుతాయని ఆశపట్టాడు. జేబుమీద చేయివేసి డబ్బులు కోసం వెతికాడు. కానీ లాటరీలొ పాల్గొనేందుకు అవసరమైన డబ్బులు లేకపొవడంతొ..నిరాశతొ వెనుదిరిగాడు. కొద్ది దూరం వెళ్ళాక అటుగా వస్తొన్న తన స్నేహితుడ్ని చూసి టిక్కెట్ కు అవసరమైన 200 రూపాయలు అడిగి తీసుకుందామని చకచకా ముందుకుకదిలాడు. తన స్నేహితుడు కూడా సరే అనడం కోరిన మేరకు డబ్బులు ఇవ్వడంతొ లాటరీ టిక్కెట్ కొని ఇంటికి వెళ్ళిపొయాడు మనొజ్. రేపటి పేపర్ లొ విజేత ఎవరైవుంటారా అంటూ ఆలొచిస్తూ పడుకున్నాడు.
ఉదయాన్నే లేచి కల్లు సరిచేసుకొని పేపర్ చూడగా మనొజ్ టిక్కెట్ నంబర్ దర్శనం ఇచ్చింది. దీంతొ రాత్రికి రాత్రే కొటీశ్వరుడైన తన ఆనందానికి అవదులులేకుండా పొయాయి. పంజాబ్లోని సంగ్రూర్ జిల్లా వాసి మనోజ్ కుమార్ ఓ దినసరి కూలీ. పంజాబ్ స్టేట్ లాటరీస్ అనే సంస్థ ఆగస్టు 29న పంజాబ్ స్టేట్ రాఖీ బంపర్ 2018 పేరుతో లాటరీ నిర్వహించింది. రెండు టికెట్లకు మొదటి బహుమతిగా 1.5 కోట్ల చొప్పున అందించింది. ఇందులో మనోజ్ కూడా ఉన్నాడు. బుధవారం లాటరీస్ ఆఫ్ పంజాబ్ డైరెక్టర్ని కలుసుకుని ప్రైజ్ మనీ కోసం ఆధారాలను సమర్పించాడు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో తన కుటుంబం సతమతమవుతోందనీ… లాటరీ సొమ్ముతో ఇక తమ కష్టాలు తీరినట్టేనని మనోజ్ పేర్కొన్నాడు.
Add Comment