fbpx
Celebrities Entertainment TOLLYWOOD

రాహుల్ గెలుపు వెనుక ఆ ఇద్దరు ఆడవాళ్ళు.. నిజంగా నమ్మలేరు

నాగార్జున హోస్ట్ బిగ్ బాస్ సీజ‌న్ 3 ముగిసింది. ఈ సీజ‌న్ విజేత‌గా రాహుల్ సిప్లిగంజ్ ట్రోఫీని అందుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా ఆదివారం సాయంత్రం జ‌రిగిన ఎపిసోడ్ ఆద్యంతం ర‌క్తి క‌ట్టించింది. అయితే చివ‌రి వ‌ర‌కూ నువ్వా నేనా? అంటూ పోరు సాగించిన శ్రీ‌ముఖి ర‌న్న‌ర్ గా నిల‌వ‌డాన్ని అభిమానులు స‌హించ‌లేక‌పోతున్నారు. ఇక్క‌డో ఆస‌క్తిక‌ర‌మైన ట్విస్ట్ ఏమంటే రాహుల్ గెలుపు వెన‌క ఇద్ద‌రు మ‌గువ‌లు ఉన్నార‌న్న‌ది ఫ్యాన్స్ విశ్లేష‌ణ‌. అందులో ఒక‌రు శ్రీ‌ముఖి అనుకుంటే ఇంకొక‌రు పున‌ర్న‌వి అన్న‌ది అంద‌రి ఫీలింగ్.

బిగ్ బాస్ ఫ‌స్టాఫ్ ఆద్యంతం పున‌ర్న‌వి తో ల‌వ్ స్టోరీ వేడెక్కించింది. పున్నూ వెళ్లిపోతున్న‌ప్పుడు రాహుల్ వెక్కి వెక్కి ఏడ్వ‌డం ప్ర‌పంచంలోని ప్రేమికులంద‌రికీ క‌నెక్ట‌యిపోయి రాహుల్ పై సింప‌థీ వ‌చ్చింది. దాంతో పాటే ప‌దే ప‌దే లేడీ విల‌న్ లా శ్రీ‌ముఖి .. త‌న శ‌త్రువు అయిన రాహుల్ ని నామినేట్ చేస్తుండ‌డంతో త‌న ఉద్ధేశం న‌చ్చ‌ని చాలా మంది పురుష‌పుంగ‌వులు రాహుల్ కే మ‌ద్ధ‌తునిచ్చారు. అలా ఆ ఇద్ద‌రు గాళ్స్ గాయ‌కుడు రాహుల్ సిప్లిగంజ్ ట్రోఫీ గెలుచుకునేందుకు సాయ‌మ‌య్యార‌న్న‌మాట‌. లేదంటే బిగ్ బాస్ విజేత‌గా నిలిచిన ఏకైక లేడీగా శ్రీ‌ముఖి రికార్డుల‌కెక్కేది. చివ‌రికి ర‌న్న‌ర్ గా నిల‌వాల్సొచ్చింది.. ప్చ్!