fbpx
NEWS TOLLYWOOD

వియ్యంకులు అవుతోన్న రాజ‌మౌళి, జ‌గ‌ప‌తి బాబు..!!

డైరెక్ష‌న్ లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక ఇమేజ్ ను తెచ్చుకున్నారు జ‌క్క‌న్న రాజ‌మౌళీ స్టూడెంట్ నంబ‌ర్ 1 సినిమా నుండి నేటి ఆర్ ఆర్ ఆర్ వ‌ర‌కూ విభ‌న్న‌త‌తొ సిమిమాల‌ను తెర‌కెక్కిస్తూ తిరుగులేని విజయాల‌ను త‌న ఖాత‌లొ వేసుకుంటున్నారు. తాజాగా బాహుబ‌లి సినిమాతో ఎక్క‌డికో ఎల్లిపోయాడు. హాలీవుడ్ రేంజ్ సినిమా అయినా స‌రే రాజ‌మౌళి ముందు త‌ల‌వంచాల్సిందే అన్నంత రేంజ్ లో ఇప్పుడాయ‌న పేరు మార్మోగిపోతుంది. ఓక్క‌సారి ఓకే ఒక్క‌సారి అంటూ బ‌డా హీరొలు సైతం ఆయ‌న గ‌డప తొక్కుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.
తాజాగా రాజ‌మౌళి త‌న కొడుక్కి త‌గిన సంభందాన్ని ఎంచుకున్నారు. మ‌రి అట్లాంటి సిని దిగ్గ‌జం ఇంట అడుగుపెట్ట‌బోయే అద్రుష్ట‌వంతురాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అయితే రాజ‌మౌళి ఇంటికి కోడ‌లిగా రావాలంటే అంత‌టి అదృష్టం ఏ మ‌హాత‌ల్లి చేసుకుందో అనే క‌దా మీ డౌట్… ఆమె మ‌రెవ‌రో కాదు మ‌న జ‌గ‌ప‌తిబాబు స్వ‌యానా అన్న కూతురైన పూజాప్ర‌సాద్ గా తెలుస్తోంది. భ‌క్తి గీతాల‌తో చ‌క్క‌ని సింగ‌ర్ గా పేరు తెచ్చుకున్న పూజాప్ర‌సాద్ తో కార్తికేయ నిశ్చితార్థం బుద‌వారం ముగిసింది. ఎలాంటి హార్భాటాలు లేకుండా సింపుల్ గా ఎంగేజ్మెంట్ కానిచ్చేసారు. కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితుల స‌మ‌క్షంలో రాజ‌మౌళి నివాసంలో నిశ్చితార్ధ‌వేడుక‌లు జ‌రిగాయి.

అయితే, వీరిద్ద‌రూ ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటున్నారా అన్న ప్ర‌శ్న చాలామందికి క‌లుగుతుంది. కానీ అదేం లేద‌ట‌. పెద్ద‌ల అంగీకారంతోనే, వాళ్లు కుదిర్చిన పెళ్లినే ఈ జంట చేసుకోబోతున్న‌ట్లు రాజ‌మౌలి స‌న్నిహితులు చెప్తున్నారు. నిజంగా రాజ‌మౌళి ఇంటి కోడ‌లిగా జ‌గ‌ప‌తి బాబు అన్న కూతురు వెళ్తుందంటే ఆమె అదృష్టం కొనితెచ్చుకున్న‌ట్లే అంటున్నారు సినీ ప్ర‌ముఖులు.

అటు జ‌గ‌ప‌తి బాబు రేంజ్ కూడా త‌క్కువేం కాదు త‌న తండ్రి బ‌డా నిర్మాత కావ‌డంతొ ఇరు ప‌క్షాల వారు సంభందంపై ఆనందంతో ఉన్నారు. ఇదిలా ఉంటే స్టూడెంట్ నెం.1 సినిమా నుంచి తాజాగా రానున్న ఆర్ఆర్ఆర్ మూవీ వ‌ర‌కు అన్ని సినిమాల‌ను తెర‌కెక్కించ‌డంలో రాజ‌మౌళి ఒక్క‌డే కాకుండా, ఆయ‌న కుటుంబ స‌భ్యులంతా పాలుపంచుకుంటారన్న సంగ‌తి జ‌గ‌మెరిగిన స‌త్యం. ఇక తాజాగా రాజ‌మౌళీ ఫ్యామిలీలోకి ఒక సింగ‌ర్ కూడా వ‌చ్చి చేరార‌నీ ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు ఆనందం వ్య‌క్తంచేస్తున్నాయి.