fbpx
NEWS TOLLYWOOD

బిగ్ షాక్.. కెలికి మరీ అడ్డంగా బుక్కయిన ఆర్జీవీ..

రామ్ గోపాల్ వర్మ తిక్కకు హైదరాబాద్ పోలీసులు సరైన విధంగా సమాధానం ఇచ్చారు. ఇస్మార్ట్ శంకర్ చిత్రాన్ని వర్మ ట్రిపుల్ రైడ్ లో బైక్ పై వెళ్లి చూసిన సంగతి తెలిసిందే. ఆ దృశ్యాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పోలిసులపైనే ఆర్జీవీ సెటైర్లు వేశాడు. వివాదాస్పద రాంగోపాల్ వర్మ ఎన్నిసార్లు వివాదాల్లో చిక్కుకున్నా తన వైఖరి మాత్రం మార్చుకోడు. తాజాగా మరో మారు వర్మ వార్తల్లో నిలిచాడు. పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ చిత్రాన్ని చూసేందుకు వర్మ, ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి, లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫేమ్ అగస్త్య ముగ్గురూ ట్రిపుల్ రైడ్ లో బైక్ పై శ్రీరాములు థియేటర్ కు వెళ్లారు.వర్మ చేసే పనిని సైలెంట్ గా చేయకుండా హైదరాబాద్ పోలీసులకు కెలికాడు.

హైదరాబాద్ పోలీసులు మామూలోళ్లు కాదు.. వర్మకు నిమిషాల్లోనే బుద్ది చెప్పారు. హెల్మెట్ లేకుండా, ట్రిపుల్ రైడ్ లో బైక్ పై వెళుతున్నాం.. పోలీసులు ఎక్కడ.. బహుశా థియేటర్ లోపల ఉన్నారనుకుంటా అంటూ రాంగోపాల్ వర్మ సెటైర్లు వేశారు.వర్మ సెటైర్లకు పోలీసులు జరిమానాతో సమాధానం ఇచ్చారు వర్మ ప్రయాణించిన బైక్ నెంబర్ గుర్తించి హెల్మెట్ లేకుండా, ట్రిపుల్ రైడ్ వెళ్లినందుకు 1300 రూపాయలు జరిమానా విధించారు. వర్మ ప్రయాణించిన బైక్ నెంబర్  టీఎస్ 07 జీపీ 2552కు జరిమానా విధిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.