fbpx
NEWS TOLLYWOOD

యంగ్ చంద్రబాబుగా రానా.. ఫోటో వైరల్

భిన్న‌మైన న‌ట‌న విభిన్నమైన పాత్రలతో జాతీయ వ్యాప్తంగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌ క్రేజ్ సొంతం చేసుకున్నాడు హీరో రానా. బాహుబలి, ఘాజి వంటి బ‌హుబాషా చిత్రాలలో అద్భుత నటన కనబరిచి మెప్పించారాయ‌న‌.. అయితే ప్రస్తుతం రానా చేస్తొన్న ఒక‌ పాత్ర తాలూకు పిక్స్ సొష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇంతకీ ఎంటా పాత్ర‌..నెట్టింట్లొ ట్రెండ్ అవుతొన్న రానా న్యూ లుక్ గురించి తెలుసుకుందాం..

ఆర‌డుగుల ఎత్తులొ బ‌క్క‌ప‌లుచని దేహం. మెలితిరిగిన‌ కొర‌మీసం, వైట్ అండ్ వైట్ డ్రెస్ లో అచ్చం చంద్ర‌బాబు లా ద‌ర్శ‌న మిస్తున్నాడు రానా. ఎన్టీఆర్ బయోపిక్ లో అత్యంత కీలకమైన నారా చంద్రబాబు నాయుడు పాత్రలో రానా నటించబోతున్న రానా అందుకు త‌గిన హావ భావాలు ఫాలొ అవుతున్నారు. దీంతొ నిన్న‌ మొన్నటివరకు గుబురు గడ్డంతో కనిపించిన రానా ప్రస్తుతం క్లీన్ షేవ్ తో కనిపిస్తున్నాడు.

చంద్రబాబు యంగ్ ఏజ్ లో ఉన్నప్పటి ఫోటో, రానా తాజా లుక్ ని పోల్చుకుంటూ నెటిజన్లు సంబరపడుతున్నారు. దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరక్కిస్తున్న సంగతి తెలిసిందే. యువ‌జ‌న నాయ‌కుని మోద‌లు తెలుగుదేశం ప్ర‌భంజ‌నంతొ కీల‌క భూమిక పొషించిన చంద్ర‌బాబునాయుడి పాత్ర పై ప్ర‌త్యేక అంచానాలున్నాయి. క‌నుక‌ ఎన్టీఆర్ బయోపిక్ లో బాలయ్య పాత్ర తరువాత ఆ స్థాయిలో రానా పాత్ర హైలైట్ అవుతుంది అనడంలో సందేహం లేదు.