fbpx
Celebrities Entertainment TOLLYWOOD

రంగమత్త క్యారెక్టర్ కు మొదట ఎవరిని అనుకున్నారో తెలిస్తే షాకవ్వాల్సిందే..?

కొన్ని సినిమాల్లో కొన్ని పాత్రలు ముందుగా ఒకరి దగ్గరికి వెళ్లడం వారు రిజెక్ట్ చేశాక మరో నటులకి వెళ్లడం సర్వ సాధారణం. అయితే కొన్ని సినిమాల్లో పాత్రలు హిట్టయ్యాక అనవసరంగా వదులుకున్నానే అని బాధ పడేవారు లేకపోలేరు. ఆ లిస్టు చాలానే ఉంది. అయితే లేటెస్ట్ గా సీనియర్ హీరోయిన్ రాశి కూడా తను వదులుకున్న ఓ పెద్ద సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకుంది. అదే రామ్ చరణ్ నటించిన బ్లాక్ బస్టర్ ‘రంగస్థలం’. ఈ సినిమాలో రంగమ్మత్త పాత్ర కోసం ముందుగా రాశిను సంప్రదించాడట సుక్కు.

అయితే గ్లామర్ షో కి స్కోప్ ఉండే పాత్ర కావడంతో రాశీ ఆ పాత్రను నిర్మొహమాటంగా తిరస్కరించేసిందట. ఈ విషయాన్ని స్వయంగా చెప్పుకుంది రాశి. సో అలా రాశి వదులుకున్న పాత్రను అనసూయ చేయడం ఆ పాత్రతో మరింత పాపులారిటీ సంపాదించుకోవడం జరిగింది. ఇదే ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ ‘గోకులంలో సీత’ సినిమాలో అవకాశం వచ్చింది చిరంజీవి సతీమణి సురేఖ గారి వల్లే అంటూ తెలిపింది రాశి. ఆ సినిమా కోసం ప్రత్యేకంగా కబురు పంపి మరీ కళ్యాణ్ పక్కన నువ్వైతే బాగుంటావ్ సీత పాత్రకి నువు పర్ఫెక్ట్ అని చెప్పి ఒప్పించారట. ఇలా తనకు మాత్రమే తెలిసిన కొన్ని సంగతులను బయట పెట్టింది ఈ సీనియర్ హీరోయిన్