fbpx
Celebrities Entertainment Movies NEWS TOLLYWOOD VIDEOS

రామ్ గోపాల్ వర్మ డ్యాన్స్ చూశారా..వీడియో

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మైండ్‌లో ఫిక్స్ అయితే బ్లైండ్‌గా సినిమాలు తీసేస్తుంటాడు. అంతేకాదు వర్మ తనకు తోచితే సినిమా తీస్తాడు. తోచకపోయినా సినిమా తీయడం వర్మ నైజం. ఈ ఇయర్ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’తో సంచలనం సృష్టించిన వర్మ.. ఆ తర్వాత ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సారీ సారీ.. ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాలతో కావాల్సినంత కాంట్రవర్సీ క్రియేట్ చేసాడు. సంచలన సినిమాలను తెరకెక్కించడం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే కాదు… తనలో ఉన్న మరో కోణాన్ని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బయటపెట్టారు.

 

తనలో మంచి డ్యాన్సర్ కూడా ఉన్నాడని నిరూపించారు. వివరాల్లోకి వెళ్తే, ‘బ్యూటీఫుల్’ అనే చిత్రాన్ని వర్మ శిష్యుడు మంజు తెరకెక్కించాడు. ఊర్మిళతో హీరోయిన్ గా వర్మ గతంలో నిర్మించిన ‘రంగీలా’ సినిమాకు ట్రిబ్యూట్ గా ఈ చిత్రాన్ని చెబుతున్నారు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్లో వర్మ సందడి చేశాడు. ఒక నిమిషం పైగా వర్మ డాన్స్ చేసి అందరినీ ఆశ్యర్యపరిచాడు. త‌న డ్యాన్స్‌తో రచ్చ చేశాడు. మ‌రి ఈ వీడియో మీరూ చూసేయండి..

WATCH VIDEO:

 

WATCH VIDEO:

You may also like