బాప్ రే వర్మ.. రచ్చ అంటే మరీ ఈ రేంజ్లో ఉంటుందా? అన్నట్టుగా చార్మీతో కలిసి చెలరేగిపోయారు వర్మ. తన ప్రియ శిష్యుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ ఇటీవల విడుదలై భారీ కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రంలో హీరోగా రామ్ నటించగా.. బోల్డ్ బ్యూటీ, పూరీ కనెక్ట్స్ చార్మి నిర్మాతగా వ్యవహరించింది. ఈ చిత్రం విడుదల ముందు నుండి బీభత్సమైన ప్రమోషన్ చేస్తున్న వర్మ.. చిత్రం సక్సెస్ కావడంతో సంబరాల్లో తేలిపోతున్నాడు.
ఇస్మార్ట్ శంకర్ చిత్ర యూనిట్‌తో కలిసి శుక్రవారం నాడు సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న ఆయన.. తాగుతూ.. ఊగుతూ చెలరేగిపోయారు. షాంపైన్ బాటిల్‌ను చేత్తో పట్టుకుని కనిపించిన వర్మ.. దాంతో స్నానం చేస్తూ రచ్చ రచ్చ చేశారు. అంతటితో ఆగకుండా ఎదురుగా ఉన్న చార్మీని బిగి కౌగిటిలో బంధించి ఉక్కిరి బిక్కిరి చేశారు. చార్మిని దగ్గరకు అందరి ముందే దగ్గరకు తీసుకుని ఘాటైన ముద్దులు పెట్టాడు. పనిలో పనిగా దర్శకుడు పూరీకి ఓ కిస్ కొట్టాడు. ఇక చార్మి కూడా వర్మకు ఇ‘స్మార్ట్’ హగ్, కిస్లను తన్మయంతో ఆస్వాదించింది. వర్మ ఉత్సాహాన్ని ఏ మాత్రం డిజప్పాయింట్ చేయకుండా చార్మి కూడా సై అంది.
I am not mad , but #issmartshankar made me mad , so @purijagan and @Charmmeofficial are to blame pic.twitter.com/Sd1gIno1ER
— Ram Gopal Varma (@RGVzoomin) July 20, 2019
ఈ వీడియోను పోస్ట్ చేస్తూ.. ‘నేను పిచ్చోడిని కాదు.. కాని ఇస్మార్ట్ శంకర్ నన్ను పిచ్చోడిగా మార్చేసింది. కాబట్టి చార్మి, పూరీలనే బ్లేమ్ చేయాలి’.. అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చేశారు. ప్రస్తుతం వర్మ చేసిన ఈ వీడియోపై సెటైర్ల వర్షం కురుస్తోంది.. మందును తలపై నుండి పోసుకోవడం.. చార్మి, మిగిలిన నటీ నటులతో అలా వ్యవహరించడంతో పూర్తి పిచ్చోడిగా మారిన వర్మ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Add Comment