fbpx
Celebrities Entertainment NEWS TOLLYWOOD

శంకర్ దాదా’ సినిమా లో పిల్లాడు గుర్తుకు ఉన్నాడా?? ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా ? అతను ఎవరో తెలుసా ?

“House pasting is not a festival …!”“infront there is crocodile festival …!” ఈ డైలాగ్స్ ఇప్పటికి గుర్తుకు ఉన్నాయి కదూ..అదే మన మెగా స్టార్ గారి శంకర్ దాదా సినిమా నుండి …ఈ సినిమా మెగా స్టార్ గారి హిట్స్ లో ఇది ఎప్పటికి గుర్తుకు ఉంటుంది. సినిమా లో ని ప్రతి క్యారెక్టర్ ఈరోజకి మనం మరచిపోలేము అంటే మనకు ఎంతగా నచ్చిందో మాటల్లో చెప్పలేం కదా.. ఈ సినిమా లో కాలేజీ లో “శ్రీరామ్” అనే పిల్లాడు మరి మరి గుర్తు ఉంటాడు..క్లైమాక్స్ లో శంకర్ అని కూడా పిలుస్తాడు.ఈ అబ్బాయి పేరు వైష్ణవ్ తేజ్..చిరంజీవికి మేనల్లుడు త్వరలోనే హీరో గ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

 

సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా ఎంట్రీ ఇవ్వబోతోన్న సంగతి తెలిసిందే. సుకుమార్ శిష్యుడి దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రానికి ఉప్పెన అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈమేరకు విడుదల చేసిన పోస్టర్ ఏ రేంజ్‌లో వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

 

మాస్ మసాలా అంశాలకు పోకుండా, రా నెరేషన్‌లోనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. మత్స్యకారుల జీవన శైలి ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. అన్నింటికంటే ముఖ్య‌మైన విష‌యమేంటంటే.. ఇదో య‌దార్థ సంఘ‌ట‌న అని టాక్ వినిపస్తోంది. ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు ఇలాంటి మత్స్యకారుల నేప‌థ్యం నుంచి వ‌చ్చిన‌వాడే. త‌న ఊర్లో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న‌నే క‌థ‌గా రాసుకున్నాడ‌ని తెలుస్తోంది.

 

You may also like