fbpx
Celebrities Entertainment NEWS

కాలేజ్ రోజుల్లో….త‌న ల‌వ‌ర్ కి సోనూ సుద్ రాసిన ల‌వ్ లెట‌ర్!

డియర్ సోనాలి, ఎన్నేళ్లు గడిచినా నిన్ను నేను మర్చిపోను..అంటూ  కాలేజి రోజుల్లో ఇచ్చిన మాటని ఇప్పటికి నిలబెట్టుకుంటున్నాడు  సోనూ సూద్.. మన జీవితంలో ఏ కష్టం లేకుండా అన్ని సాఫీగా సాగిపోతున్నప్పుడు ప్రేమ,ఆప్యాయతలు ఉండడం బంధం అల్లుకోవడం ఏమంత పెద్ద విషయం కాదు.. కానీ మనం జీరోగా ఉన్నప్పుడు మనల్ని ఎవరైతే ప్రేమిస్తారో, మన సక్సెస్ కి వారి తోడ్పాటుని అందిస్తారో.. మనం కష్టాల్లో ఉంటే  మన పక్కనే నిలబడతారో అదీ నిజమైన ప్రేమ..అలాంటి అందమైన ప్రేమే సోనూ సూద్- సోనాలి లది..

 

సోనూసూద్  నాగ్ పూర్లో  చదువుకునే రోజుల్లో అక్కడే సెటిల్ అయిన తెలుగు కుటుంబానికి చెందిన అమ్మాయి సోనాలితో పరిచయం అయింది.. లవ్ యట్ ఫస్ట్ సైట్.. ఇద్దరిది ఒకే కాలేజ్ సోనూది ఇంజనీరింగ్, సోనాలి చదివేది MBA.. అప్పుడు మొదలైన తొలి ప్రేమ..ఇప్పటికి అదే ప్రేమ వారిమధ్య.. కొన్నేళ్లపాటు నడిచిన ప్రేమాయణం పెద్దలు ఒప్పుకోవడంతో ఒకటయ్యారు.. ఇద్దరికి చదువుంది ఉద్యోగాలు చేసుకుంటూ సంతోషంగా బతకొచ్చు అనేది సోనాలి ప్లాన్..పెద్దలు కూడా అలాగే ఆలోచించారు..

 

కానీ, సోనూ ఆలోచనలు వేరు … సినిమాల్లో యాక్ట్ చేయాలనేది తన కోరిక..మొదట్లో సోనాలి ఒప్పుకోలేదు.. కానీ తనపై ఉన్న ప్రేమ వల్ల నో చెప్పలేకపోయింది..సోనూని తనే స్వయంగా ముంబై పంపించింది.. అక్కడ తను ఒక ఉద్యోగంలో చేరింది..ముంబైకి చేరుకున్న సోనూసూద్ చిన్న జాబ్ చూస్కుని అది చేస్తూ, సినిమా ఆఫీస్ ల చుట్టు  తిరిగేవాడు..మొత్తానికి వారి కష్టానికి ఫస్ట్ టైం తమిళ్ సినిమాలో అవకాశం వచ్చింది..చిన్నచిన్న అవకాశాలు రావడంతో సోనాలిని ముంబై తీసుకొచ్చేసాడు.

 

మహానగరంలో ఇప్పుడు సోనూకి పేర సెవెన్ స్టార్ హోటల్, ఏడంతస్తుల మేడ ఉంది కానీ..ఫస్ట్ టైం సోనాలిని తీస్కొచ్చినప్పుడు సింగిల్ బెడ్రూం ప్లాట్ లో తమ లైఫ్ స్టార్ట్ చేశారు..సోనూ యాక్ట్ చేస్తున్నాడని తను ఇంట్లోనే ఉండిపోవాలనుకోలేదు ..తను ఉద్యోగంలో జాయిన్ అయింది..సోనూ చేతిలో అవకాశాలు లేనప్పుడు సోనాలియే తనకు,కుటుంబానికి సపోర్ట్ గా నిలిచింది..అప్పటికే వారికి ఇద్దరు పిల్లలు ఇషాన్,అయాన్..

ఒక్కో స్టెప్ ఎక్కుతూ ఇప్పుడు ఈ స్థాయికి చేరుకున్నా..సోనాలి,పిల్లలు పబ్లిసిటికి దూరంగా తమ ప్రైవేట్ లైఫ్ ని హ్యాపీగా బతికారు..సోనూ స్టార్ డమ్ ఇంటి బయట వరకే..ఇంట్లో తనో సాధారణ వ్యక్తి..ఇద్దరు పిల్లల తండ్రి, భార్యను జీవితాంతం ప్రేమించే ప్రేమికుడు మాత్రమే..సినిమా వాళ్ల పర్సనల్ లైఫ్స్ గజిబిజిగా ఉండే విషయం తెలిసిందే..కానీ సోనూ మాత్రం తను కాలేజ్ టైంలో ఇచ్చిన ప్రామిస్ ని ఇప్పటికి నిలబెట్టుకుంటున్నాడు..సోనాలి పంచిన ప్రేమకి రెట్టింపు ప్రేమని అందిస్తున్నాడు.

తను జీరోగా ఉన్నప్పుడు తోడు నిలబడింది.ఇప్పుడు తన దగ్గర ఏం మిగుల్చుకోకుండా దానం చేస్తున్న మనం ఎలా బతుకుతాం అని ప్రశ్నించలేదు..మీడియా వాళ్లు అదే ప్రశ్న అడిగినా నవ్వి ఊరుకుంది..ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అంటారు.. సోనూ సూద్ ప్రతి కష్టంలో, సంతోషంలో తోడున్న ఏకైక వ్యక్తి సోనాలి.. అతడి విజయాన్ని ఆస్వాదించే అర్హత ఉన్న ఏకైక వ్యక్తి కూడా..

మీకు ఈ ఆర్టికల్ నచ్చితే షేర్ చెయ్యండి