fbpx
NEWS

భారతదేశంలోని అందమైన, ఆత్యంత శ‌క్తివంతమైన టాప్ 5 మహిళ ప్రభుత్వ అధికారులు

ఇప్పుడు దేశంలొ వారంతా అత్య‌దిక ఫ్యాన్ ఫాలోయింగ్ క‌లిగిన సెల‌బ్రెటిస్ వారు, అలా అని వాళ్ళేం సినితార‌లు కారు. . రోజురొజుకు ప‌రుగులు పెడుతొన్న‌ దేశ ప్ర‌గ‌తిలొ వారిదే కీ రొల్ కానీ వారు పొలిటీషియ‌న్స్ కారు. అందంలొనూ, అనుకువ‌లొనూ, ప్రేమ‌ను పంచే అమ్మ‌త‌నాన్ని చూప‌డంలొనూ ముందుంటారు అలా అని అల్లాట‌ప్ప మ‌హిళ‌లు కాదు వారు. ప‌రిపాల‌న‌లొ ప్ర‌ధాన భూమిక పొషిస్తూ స్థిర‌మైన నిర్ణ‌యాలు తీసుకుంటూ దేశ మ‌నుగ‌డ‌కు క్రుషిచేస్తున్న మ‌హిళా అధికారునులు వాళ్ళు. భారతదేశంలో ఉండే అంద‌మైన మ‌రియు అత్యంత ప్ర‌భావ‌శీల టాప్ 5 మహిళ అధికారుల గురించి తెలుసుకుందాం.

స్మిత సబర్వాల్ ఈమెను పీపుల్స్ ఆఫీసర్ అని పిలుస్తారు. ఇటువంటి బిరుదు ఓ మహిళ అధికారికి రావడం చాలా గర్వకారణం. చాలా చిన్న వ‌య‌స్సులొనే ముఖ్యమంత్రి కార్యాలయంలో నియమింపబడిన మహిళా ఐఎఎస్ ఆఫీసర్ కుడా ఈమె. కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటూ..కొత్తరాష్ట్రం తెలంగాణ అభివ్రుద్దికి ఎంత‌గానొ క్రుషిచేస్తున్నారు స్మిత స‌బ‌ర్వాల్.

చంద్రకళా చంద్రకళా ఒక ఐఎఎస్ ఆఫీసర్. ఈమె 2008 యూపీ క్యాడర్ బ్యాచ్ కు చెందిన‌వారు. అంతేకాకుండా ఈమె ఓ గిరిజన కుటుంబం నుంచి వచ్చారు. ఈమె ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్షహర్ జిల్లాలో మేజిస్ట్రేట్ గా విధులు నిర్వ‌హిస్తున్నారు.

మెరీన్ జోసెఫ్ మెరీన్ జోసెఫ్ 2012 సంవత్సరంలో జరిగిన యూపీఎస్సీ పరీక్షను కేవలం 25 సంవత్సరాల వయస్సు లోనే క్లియర్ చేసిన ఘ‌న‌త త‌న సొంతం. ఈమె కేరళ క్యాడర్ లో చాలా అందమైన మరియు యువ ఐపిఎస్ ఆఫీసర్. ఈమె Y20 సమ్మిట్ కోసం భారత బృందానికి నాయకత్వం వహించడానికి ఎంపిక అయ్యారు. ఇది G20 దేశాల అధికారిక యువతకు సంబంధించిన కార్యక్రమం.

సంజుక పరాశర్ ప‌రాశ‌ర్ అస్సాం రాష్ట్రంలో జన్మించిన‌ 2006 బ్యాచ్ కు చెందిన ఓ ఐపిఎస్ అధికారి. అస్సాం రాష్ట్రం నుంచి ఐపిఎస్ అధికారిగా పని చేస్తున్న మొట్టమొదటి మహిళా ఐపీఎస్ అధికారిణి కావడం విశేషం. ఈమె ఢిల్లీ లోని ఇంద్రప్రస్థ కాలేజీలో పొలిటికల్ సైన్స్ ను పూర్తి చేసారు. ప్రస్తుతం సోనిత్పూర్ లో పోలీస్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నారు. అంతేకాకుండా ఈమె అస్సాం రాష్ట్రంలోని బోడో తీవ్రవాదులతో పోరాటం చేసింది.

లెఫ్టినెంట్ గనీవ్ లాల్జీ లాల్జీ ఆర్మీలో మూడోవ తరం ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. ఈమె 2013 వ సంవత్సరంలో సెంట్రల్ ఆర్మీ కమాండర్ లెక్క జనరల్ రాజన్ బక్షి యొక్క ADC గా బాధ్యతలు చేపట్టిన తర్వాత చరిత్ర సృష్టించారు. వీళ్ళంతా ఆయా రాష్ట్రాల ప్ర‌గ‌తిలొ ప్ర‌ధాన భూమిక పొషిస్తున్నారు. క‌ఠిన‌మైన నిర్ణ‌యాలు తీసుకునే స‌మ‌యంలొ స్థిరంగా ముందుకు దూసుకుపొతున్నారు. క్ర‌మ‌శిక్ష‌న‌తొ నిబ‌ద్ద‌త‌తొ సేవ చేస్తున్నారు. దేశంలొ అట్రాక్ష‌న్ గా నిలుస్తూ యువ‌త‌కు మార్గ‌నిర్దేశ‌క‌త్వం వ‌హిస్తున్నారు.