fbpx
Celebrities Entertainment Movies NEWS TOLLYWOOD

తులసి సినిమాలో చేసిన ఈ బుడ్డోడు ఇప్పుడు ఎంత పెద్ద స్టారో తెలుసా ?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎంతో మంది బాలనటులుగు గా స్టార్లుగా సూపర్ స్టార్లు గా ఎదిగారు.సూపర్ స్టార్ కృష్ణ కొడుకుగా మహేష్ బాబు బాల్యం లోనే ఎన్నో సినిమాల్లో నటించాడు.కొన్ని సినిమాల్లో హీరోగా క్లూడా నటించాడు.ఆ తర్వాత చదువుల కోసం తాత్కాలికంగా విరామం ఇచ్చి మల్లి రాజకుమారుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు.ఇలాగె నందమూరి బాలకృష్ణ కూడా బాల్యం లో తన తండ్రి ఎన్టీఆర్ తో కలిసి చాల సినిమాల్లో బాల నటుడిగా చేసాడు.వెంకటేష్ ,నాగార్జున వంటి వారు కూడా ఒక్కటి రెండు సినిమాలు బాల్యం లో నటించారు.కానీ బాల నటుడిగా మహేష్ బాబు తర్వాత ఎక్కువ సినిమాలలో నటించిన మరో హీరో తరుణ్.సుమారు 20 సినిమాలకు పైగానే ఈయన బాలనటుడిగా నటించాడు.

జూనియర్ ఎన్టీఆర్ కూడా విశ్వామిత్ర మరియు బాల రామాయణం చిత్రాలలో బాల నటుడిగా నటించిన సంగతి మన అందరికి తెలిసిందే.సినిమాల్లోకి రాకముందు ఆయన భక్త మార్కండేయ అనే టీవీ సీరియల్ లో కూడా నటించాడు.ఈ సీరియల్ అప్పట్లో జెమినీ టీవీ లో ప్రతి ఆదివారం ప్రసారం అయ్యేది.

ఇది ఇలా ఉండగా విక్టరీ వెంకటేష్ హీరో గా బోయపాటి శ్రీనము దర్శకత్వం లో వచ్చిన తులసి సినిమా అప్పట్లో భారీ విజయం సాధించిన సంగతి మన అందరికి తెలిసిందే.ఈ సినిమా లో వెంకటేష్ కొడుకుగా నటించిన మాస్టర్ అతులిత్ కి నటించిన మొదటి సినిమా తోనే ఎలాంటి పేరు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈ సినిమాలో బుడ్డోడి నటనని ఇప్పటికి ఎవ్వరు మర్చిపోలేరు.అప్పట్లో ఈ కుర్రాడిని అందరూ నిజంగానే విక్టరీ వెంకటేష్ కొడుకు అనే అనుకున్నారు.ఎందుకంటే వీళ్లిద్దరి ఫేస్ కట్ దాదాపుగా ఒక్కేలా ఉండడం వల్ల.కానీ అది నిజం కాదు.

 

దర్శకుడు బోయపాటి శ్రీను తులసి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ కోసం ఆడిషన్స్ జరుపుతున్న టైం లో ఈ కుర్రాడు దాదాపు గా వెంకటేష్ ఫేస్ కట్ తో ఉండడంతో అతనిని సెలెక్ట్ చేసి తన సినిమాలో పెట్టుకున్నాడు.చేసిన ఒక్క సినిమాతోనే ఈ బుడ్డోడికి విపరీతమైన పేరు ప్రఖ్యాతలు రావడంతో వరుసగా లడ్డు బాబు మరియు మా నాన్న చిరంజీవి వంటి సినిమాలో నటించాడు.ఈ రెండు సినిమాలలో కూడా ఈ బుడ్డోడి నటనకి మంచి మార్కులే పడ్డాయి.ఇక పెరిగి పెద్ద అవుతుండడంతో పెద్ద చదువుల కోసం సినిమాలకు దూరం అయ్యాడు ఈ కుర్రాడు.

ఇక బాలనటుడిగా అలరించిన ఈ బుడ్డోడు ఇప్పుడు త్వరలోనే హీరోగా వెండితెర పై మెరవబోతున్నాడు.అది కూడా అలాంటి ఇలాంటి సినిమా కాదు తన గాత్రం తో తెలుగు సినీ ప్రేక్షకులను సుమారు నాలుగు దశాబ్దాల పాటు అలరించిన ప్రముఖ గాయకుడు గంటసాల జీవిత చరిత్రలో గంటసాల పాత్ర లో మెరవనున్నదాడు అతులిత్.ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ కూడా విడుదల చేసారు.ఈ పోస్టర్ లో అతులిత్ ఐ చూసిన అందరూ ఒక్కసారిగా షాక్ కి గురి అయ్యారు.అచ్చు గుద్దినట్టు గంటసాల లాగ ఉన్న అతులిత్ ని చూసి ఇతను తులసి సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్టా అని అందరూ ఆశ్చర్యపోయారు.ఈ సినిమాలో ఆయన గంటసాల గా అద్భుతంగా నటించాడు అంట.

ఈ సినిమాలో ఆయన నటన చూసిన ఎవ్వరైనా షాక్ కి గురి కావాల్సిందే అట.ఇప్పటికే టాలీవుడ్ లో బయో పిక్స్ హావ నడుస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే.మహా నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తీసుకొని తీసిన మహానటి సినిమా ఎంతటి ఘానా విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇప్పడు గంటసాల బయోపిక్ కూడా అదే స్థాయిలో సహజంగా ఉండబోతుంది అట.అతి త్వరలో మన ముందుకి రాబోతున్న ఈ సినిమాలో ఘంటసాల గా అతులిత్ నటన ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుందో తెలియాలి అంటే మరి కొద్దీ రోజులు వేచి చూడాల్సిందే.ఆ సినిమా పోస్టర్ ని ఎక్సక్లూసివ్ గా మీ కోసం క్రింద అందిస్తున్నాము