fbpx
Celebrities Entertainment NEWS TOLLYWOOD

బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టనున్న యూట్యూబ్ స్టార్ గంగవ్వ.

బిగ్ బాస్ హౌజ్‌లోకి గంగవ్వను సీజన్‌ ఫోర్‌కు నిర్వాహకులు ఎంపిక చేశారని.. అంతేకాదు గంగవ్వ కోసం ప్రత్యేకంగా కొన్ని ఆటల్ని డిజైన్ చేస్తున్నరంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. అయితే, ఈ వార్తపై బిగ్‌బాస్ నుంచి కానీ, గంగవ్వ నుంచి కానీ ఎటువంటి స్పష్టత లేదు. అయితే ఒక వేళా ఇదే నిజమైతే.. గత మూడు సీజన్‌లలో ఇంత వయసున్న వారిని బిగ్‌బాస్‌కు ఎంపిక చేయలేదని, గంగవ్వే తొలి వ్యక్తి కాబోతోందని అంటున్నారు. అయితే యూట్యూబ్ ప్రేక్షకులకి గంగవ్వ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

మై విలేజ్ షోకి సంబంధించిన వీడియోలతో ఫుల్ పాపులారిటీ పొందింది. కొన్ని సినిమాలలో నటించింది. సమంత, విజయ్ దేవరకొండ, కాజల్ వంటి స్టార్స్‌తో ముచ్చటించింది.

అనేక మంది ప్రశంసలు కూడా పొందింది. అయితే తాజా సమాచారం ప్రకారం గంగవ్వకు బిగ్ బాస్ నుండి పిలుపు వచ్చిందనే వార్త హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ యాసతో చుట్టు పక్కన వాళ్ళ గుండెళ్లో రైళ్ళు పరిగెత్తించే గంగవ్వ.. ఇంటి సభ్యులతో ఫుల్ కామెడీ చేస్తుందని భావించిన నిర్వాహకులు ఆమెని ఎంపిక చేసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరగుతుంది.

కాని గత మూడు సీజన్‌లు చూస్తే ఇంత వయస్సు ఉన్న కంటెస్టెంట్స్ ఎవరిని ఎంపిక చేయలేదు. మరి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వార్తలో నిజమెంత ఉందనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగక తప్పదు