fbpx
NEWS

ఫోటోగ్రఫీ ఇల్లు, ఫోటోగ్రఫీ మీద అభిమానంతో ఎలా కట్టుకున్నాడో చుడండి.

కర్ణాటకలోని బెల్గాంకు చెందిన రవి హోంగల్‌కు చిన్నప్పటి నుంచి ఫోటోగ్రఫీ అంటే ఇష్టం. రకరకాల చిత్రాలను కెమెరాలో బంధించడానికి సమీప గ్రామీణ ప్రాంతాలకు కూడా వెళ్లేవాడు. ఇప్పుడు ఇంటినే కెమెరాగా కట్టించుకున్నాడు. అంతేకాదు తన కుమారులకు కానన్, నికాన్, ఎప్సన్ అంటూ కెమెరా బ్రాండ్ల పేర్లు పెట్టాడు. ఆ పేర్లను ఇంటిపైన రాపించాడు. ఇంటి వెలుపలి భాగంలో లెన్స్, ఫ్లాష్, షోరీల్, మెమరీ కార్డ్, వ్యూఫైండర్ ఉంటాయి. అలాగే, ఇంటి లోపల పైకప్పుల గోడలు కెమెరా భాగాలను పోలి ఉంటాయి. ఈ ఇంటి నిర్మాణానికి సుమారు రూ. 71,63,048 రూపాయలు ఖర్చుపెట్టాడు. అయితే కొందరికి తాము చేసే వృత్తిపట్ల అపారమైన గౌరవం, ప్రేమ ఉంటాయి.

జీవితాన్ని తమ వృత్తికి అంకితం చేసేస్తారు. అయితే ఈ వ్యక్తికి మాత్రం తన వృత్తి పట్ల పిచ్చి ప్రేమ ఉంది. వృత్తిని దైవంగా భావించాడు. ఆ భక్తి భావనతో ఆయన కెమెరా ఆకారంలో ఇల్లునే నిర్మించుకున్నాడు. తాను చేసే పనిపట్ల తనకున్న ప్రేమను పదే పదే చెప్పడం కన్నా.. ఒక్కమాటలో మౌనంగా ఇలా ఇంటి నిర్మాణంతో చెప్పేశాడు.

ఆయన ఫోటోగ్రాఫర్ అని ఇప్పటికే అర్థమైపోయింది కదూ. కర్ణాటకలోని బెల్గాంకు చెందిన రవి హోంగల్‌కు చిన్నప్పటి నుంచి ఫోటోగ్రఫీ అంటే ఇష్టం. రకరకాల చిత్రాలను కెమెరాలో బంధించడానికి సమీప గ్రామీణ ప్రాంతాలకు కూడా వెళ్లేవాడు. సహజంగా చాలామంది ఫోటోగ్రాఫర్లు తాము తీసిన ఫోటోలతోనే ఎక్కువగా ప్రాచుర్యం పొందుతారు. ఈయన తాను తీసిన ఫోటోల ద్వారానే కాకుండా, ఇలా ఇల్లు కట్టి కూడా ఫేమస్ అయ్యాడు. అంతేకాదు తన కుమారులకు కానన్, నికాన్, ఎప్సన్ అంటూ కెమెరా బ్రాండ్ల పేర్లు పెట్టుకున్నాడు. ఆ పేర్లను ఇంటిపైన రాపించాడు. ఇంటి బయట లెన్స్, ఫ్లాష్, షోరీల్, మెమరీ కార్డ్, వ్యూఫైండర్ ఉండేలా డిజైన్ చేయించాడు. దూరం నుంచి చూస్తే ఓ పెద్ద సైజు కెమెరాను ఇక్కడ ఎవరు పెట్టారనే అనుమానం కలుగుతుంది.

ఇంటి లోపల, పైకప్పుల గోడలను కూడా కెమెరా భాగాలను పోలి ఉండేలా కట్టించుకున్నాడు. తనకు నచ్చినట్టు, తన వృత్తిని బహిర్గతం చేసేలా ఆ ఇంటిని నిర్మించడానికి ఆయనకు సుమారు రూ. 71,63,048 ఖర్చు అయిందట. ఇంటికి సంబంధించిన ఫోటోలను ఆయన సోషల్‌మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఇంటిని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.