fbpx
NEWS

రైల్వే స్టేషన్‌లోకి యముడొచ్చాడు.. రూల్స్ బ్రేక్ చేస్తే ఎత్తుకుపోతున్నాడు..

రైల్వే స్టేషన్‌లోకి యముడొచ్చాడు.. విచిత్రంగా ఉన్నా.. ఇదే నిజం. అదేంటి యమలోకంలో ఉండే యమధర్మరాజు రైల్వే స్టేషన్ కు ఎందుకొస్తాడు? అనే డౌట్ వస్తుంది. కానీ ఓరైల్వే స్టేషన్ లోకి సడెన్ గా యముడు ఎంట్రీ ఇచ్చాడు. మహారాష్ట్రలో ఈ అనుభవాన్నే ఎదుర్కొన్నారు కొందరు వ్యక్తులు. దేశ వ్యాప్తంగా రైల్వే క్రాసింగ్‌లతో పాటు రైల్వే ట్రాక్‌ల వద్ద తరుచూ ప్రమాదాలు జరుగుతోన్న నేపథ్యంలో వీటిపై అవగాహన కల్పించడానికి ముంబయి రైల్వే స్టేషన్ లో పశ్చిమ రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ వినూత్న ప్రయత్నం చేసింది. యముడి వేషధారణలో రైల్వే స్టేషన్‌లోకి ఓ వ్యక్తి వచ్చాడు. రైల్వే ట్రాక్‌పై నుంచి వెళ్తున్న వారిని భుజంపై వేసుకొని నరకానికి తీసుకెళ్తున్నట్లు నటించాడు.

 

రైల్వే శాఖ సూచించే నిబంధనలు పాటించకపోతే యమలోకానికెళతారంటూ యమ ధర్మరాజు వేషధారణలోని వ్యక్తి ఇలా హెచ్చరించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ చేసిన వినూత్న ప్రయోగంపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

Add Comment

Click here to post a comment

Your email address will not be published. Required fields are marked *